Revanth challenged BRS and BJP on 42 percent reservation for BCs:  తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలకమైన సవాల్ చేశారు. బీసీ కులగణన చట్టబద్ధత, డేడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఆలస్యమైనప్పటికీ.. లేకపోతే ఇతర సమస్యలు ఎదురైనా.. పార్టీ పరంగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ చేశారు. స్థానిక సంస్థలకు 42 శాతం రిజర్వేషన్లు బీసీ వర్గాలుక కేటాయించడానికే  ప్రస్తుతం కులగణన చేపట్టారు. అలాగే ఈ రిపోర్టు లేదా.. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినా అది న్యాయస్థానాల్లో నిలబడుతుందా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఇతర పార్టీలకు ఇలాంటి సవాల్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.    

Also read :  సమగ్ర సర్వే సరిగ్గా జరగలేదు, అన్నీ కాకి లెక్కలే - తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

గతంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఉండేవి. అయితే అప్పట్లో కోర్టు ప్రత్యేక పర్మిషన్ తీసుకుని నిర్వహించారు. తర్వాత విచారణల్లో బీసీలుక 42శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల కోటా పరిమితి యాభై శాతం దాటిపోతోందని ఈ కారణంగా చెల్లవని కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు వచ్చినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. దాంతో తగ్గించిన రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించారు.  చట్టబద్ధంగా ఇవ్వకపోయినా తాము బీసీలుక 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అప్పట్లో బీఆర్ఎస్ హైకమాండ్ ప్రకటించింది. ఎంత ఇచ్చిందో స్పష్టత లేదు.              

Also Read:  లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !

ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అచ్చంగా అలాంటి డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్లాలని అంటోంది. బీఆర్ఎస్ నేత, జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రత్యేక ఉద్యమం చేశారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు. ఇతర పార్టీలు కూడా అదే డిమాండ్ చేస్తున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్లకు వచ్చే చట్టబద్దమైన సమస్యల కారణంగా అసలు స్థానిక ఎన్నికలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుపోతాయన్న ఆందోళన ఉంది.                                    

ఇప్పటికే ఆలస్యమైనందున మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ నెలలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రిజర్వేషన్లు కల్పించడం దాదాపుగా అసాధ్యం. అందుకే రాజకీయ పార్టీలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అందరం 42 శాతం రిజర్వేషన్లు ఇద్దామని మోటివేట్ చేస్తున్నారని అంటున్నారు.          

Also Read:  సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందా ?-అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను పరిగణనలోకి తీసుకోం - రేవంత్ కీలక వ్యాఖ్యలు