Ponguleti Vs KTR: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్‌కు ఏం పని మంత్రి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించిందన్నారు. కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు గవర్నర్‌కు ఏసీబీ విజ్ఞప్తి చేసింది.. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రెస్ కార్ల పందెంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదని పొంగులేటి తెలిపారు. కేంద్రమంత్రులను ప్రాధేయపడి కేసులు వెనక్కి తీసుకోవడానికి ఢీల్లీకి వెళ్లారా అని ప్రశ్నించారు.
Also Read: ఢిల్లీకి కేటీఆర్ - రేవంత్ పై ఫిర్యాదుకా ? అరెస్టు నుంచి తప్పించుకోవడానికా ?
అదాని. అంబాని లేదా ఢిల్లీలో ఎవరిని కలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఎవరి ప్రమేయంతో బెయిల్ పొందారో అదే రీతీలో ఢీల్లీలో ఎవరిని కలిసారో మాదగ్గర ఆదారాలు ఉన్నాయన్నారు. రెండు, మూడు రోజుల్లో ఏ బాంబు పేలుతుందో కేటీఆర్ కు తెలుసని.. ఈ క్రమంలోనే కేటీఆర్ డిల్లీ పర్యటన హడావుడిగా చేస్తున్నారని అన్నారు. ఈ కార్ రేస్ లో తప్పు జరగ్గకుంటే ఎందుకు భయపడుతున్నారు. విదేశాలకు 55 కోట్ల రూపాయలు ఎలా వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు చేతికి అందాకే ఎంవోయూలో సంతకాలు జరిగాయి. ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆ అన్నింటిని బయటపడేతే అంతరిక్షంలో దాక్కుంటారని సెటైర్ వేశారు. పేదోడికి చెందాల్సిన ఆస్తులను కొల్లగొట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో స్పందించారు . తాను ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యానని అప్పుడే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని సెటైర్ వేశారు.
Also Read: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా బాంబుల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. త్వరలో బాంబులు పేలుతాయని పొంగులేటి హెచ్చరిస్తున్నారు. తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తాను సిద్ధమని కేటీఆర్అంటున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. రాజకీయంగానూ దుమారం రేపుతోంది.