Ec Notice To pragati Bhavan :   తెలంగాణ ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి రాష్ట్ర్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. అన్ని పార్టీల కార్యక్రమాలపై ఎన్నికల అధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికే తనిఖీల్లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీల ఫిర్యాదులపై కూడా ఈసీ తక్షణమే స్పందిస్తోంది.తాజాగా ప్రగతిభవన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి అధికారిక భవన్‌లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. ఇదే అంశంపై నిన్న సాయంత్రం సీఈవో వికాస్‌రాజుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌ భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌పై వచ్చిన ఫిర్యాదుపై అధికారులంతా చర్చించారు. ఎవరికి నోటీసులు ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ప్రగతిభవన్ నిర్వహణ అధికారికి ఈసీ నోటీసులు పంపించింది. ప్రగతిభవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై ఈసీ వివరణ కోరింది.                 


ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు - వీఆర్ఎస్ తీసుకొని ఎన్నికల్లో పోటీ


ఈ నెల  17న  రాజకీయ పార్టీలతో  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కోడ్, ఇతర అంశాల గురించి చర్చించారు. అయితే  ప్రగతి భవన్ లో  బీఆర్ఎస్ అభ్యర్ధులకు  కేసీఆర్ బీ ఫారాలు అందించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ  సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై బీఆర్ఎస్  అభ్యంతరం తెలిపింది.  సీఎం అధికారిక నివాసంలో  బీ ఫారాలు అందించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును బీఆర్ఎస్ తోసిపుచ్చింది. ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు  బీ ఫారాలు అందించారనే ఫిర్యాదుపై  విచారణకు  సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.         


వైఎస్ఆర్‌సీపీలో బాలినేనికి వరుస అవమానాలు - పొమ్మనలేక పొగపెడుతున్నారా ?                           


 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల  9న విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో  తక్షణమే ఎన్నికల కోడ్  అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  అధికారులు వార్నింగ్ ఇచ్చారు. కొసమెరుపేమిటంటే ఈసీ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ కొంత మందికి బీఫామ్ ఇచ్చారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా ప్రకటించారు.