డ్రోన్ల ద్వారా మందులు అందించే ప్రక్రియలో (మెడిసన్ ఫ్రమ్ స్కై) మరో సరికొత్త టెక్నాలజీ చేరింది. ఆటోమెటిగ్గా మందులు అందించే తీరుగా టీ- వర్క్స్ (T-Works) సంస్థ పేలోడ్‌ను రూపొందించింది. హైదరాబాద్ నగరానికి చెందిన డ్రోన్ కంపెనీ ఎయిర్‌సర్వ్ సహకారంతో దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా రూపొందించిన సాంకేతికత ద్వారా డ్రోన్లు వాటంతట అవే ఆటోమెటిగ్గా మందులను అందించగలుగుతాయి. ఇప్పటివరకు డ్రోన్ల ద్వారా సరఫరా అయిన మందులను ఆస్పత్రి సిబ్బంది తీసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం టీ వర్క్స్ తీసుకొచ్చిన టెక్నాలజీ ద్వారా కోల్డ్ స్టోరేజ్ మెడికల్ సప్లయిస్ పేలోడ్ ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే మందులను వదిలి వచ్చేస్తుంది. ఒక్కసారి పేలోడ్‌ను విడిచి పెట్టాక.. డ్రోన్లు వాటంతట అవే వాటి ప్రారంభ స్థావరానికి చేరుకుంటాయి. డ్రోన్ నుంచి పేలోడ్ విడుదల కావడానికి కేవలం ఒక సెకను మాత్రమే సమయం పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటానికి ఈ విధానం తోడ్పడనుంది. 



Also Read: స్పెషలైజేషన్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టండి.. స్థానికంగానే వైద్య సేవలు అందించాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..


ప్రయోగం విజయవంతం కావడంతో.. 
డ్రోన్ల నుంచి పేలోడ్ విడుదల ప్రక్రియను ఎయిర్‌సర్వ్ సంస్థ ఈరోజు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. వికారాబాద్ ఏరియా ఆస్పత్రి నుంచి మాడుగుల చింతపల్లి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు మందులు పంపింది. ఈ రెండు కేంద్రాల మధ్య 6.2 కి.మీ దూరం ఉంది. మెడిసన్స్ ఫ్రమ్ స్కై ట్రయల్స్ కార్యక్రమంలో భాగంగా మందులను పంపించింది. ఈ కార్యక్రమం విజయవంతమైందని ఎయిర్‌సర్వ్ సంస్థ వెల్లడించింది. 



Also Read: తెలుగు అకాడమీ ఉద్యోగులు - బ్యాంక్ స్టాఫ్ కలిసి చేసిన దోపిడి ! ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు


డ్రోన్ల నుంచి మందులు తీసుకునేటప్పుడు ప్రమాదం జరగకుండా.. 
ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్య సిబ్బంది డ్రోన్ల ద్వారా వచ్చే మందులను తీసుకునేవారు. ఈ ప్రక్రియలో డ్రోన్ల వల్ల వైద్య సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మాన్యువల్ విధానంగా కాకుండా ఆటోమెటిగ్గా మెడిసన్స్ అందించాలనే ఉద్దేశంతో పేలోడ్ డిజైన్ చేశామని టీ వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి వెల్లడించారు. అన్ని రకాల ఔషధాలను సాధారణ ఉష్ణగ్రత వద్ద పంపలేమని గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఎయిర్ సర్వ్ సహకారంతో కోల్డ్ స్టోరేజ్ పేలోడ్ (cold storage medical supplies payload) రూపొందించినట్లు పేర్కొన్నారు. 






Also Read: పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...


Also Read:  దసరాకి ఊరెళ్తున్నారా..? ఇలా చేస్తే మీ కాలనీకే బస్సు వస్తది.. ఆర్టీసీ ఛైర్మన్ ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసంABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.