Nizamabad Congress:    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర  నిజామాబాద్ క్యాడర్‌లో జోష్ నింపనుంది. శనివారం రాత్రి జిల్లాలో అడుగు పెట్టనున్న హాత్ సే హాత్ జోడో యాత్ర 13వ తేదీ నుంచి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఒక్కో రోజు ఒక్కో నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. 12వ తేదీన కమ్మర్ పల్లిలో రైతులతో ముఖా ముఖీ కార్యక్రమంలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగించిన అనంతరం ఈనెల 11వ తేదీ రాత్రి నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి చేరుకుని అక్కడ బస చేయనున్నారు రేవంత్ రెడ్డి. హాత్ పే హాత్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ లోని 5 నియోజకవర్గాల్లో పాదయాత్రలు, రైతులతో సమావేశాలు, బీడీ కార్మికులతో సమావేశాల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్ పనులను సందర్శించనున్నారు. ప్రతి నియోజకవర్గంలోని జిల్లా కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. జిల్లాలో మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ ను ఆయా ముంపు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మంచిరిజర్వాయర్ సందర్శించి అక్కడి ముంపు బాధితులతో మాట్లాడనున్నారు. ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎలాంటి పదవులు దక్కని అసంతృప్తులతో రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 


రేవంత్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు ! 


రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేవంత్ పాదయాత్రలు చేసే నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నేటి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. తిరిగి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా తన యాత్ర షేడ్యూల్ ను రూపొందించారు. 


ఆదివారం నుంచి జిల్లాలోనే రేవంత్  -  పూర్తి రూట్ మ్యాప్ ఇదే !
 
కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగించుకుని 11వ తేదీ రాత్రి 9 గంటలకు నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి.... 12వ తేదీ ఉదయం 9 గంటలకు బీంగాల్ లింబాద్రి నర్సింహస్వామి దర్సనం, ఉ 11 గంటలకు కమ్మర్ పల్లిలో రైతులతో సమావేశం కానున్నారు. 13 వ తేదీ ఉ 8 గంటల కమ్మర్ పల్లి నుంచి ఉప్లూర్ వరకు పాదయాత్ర అక్కడే లంచ్ విరామం తిరిగి సాయంత్రం 4 గంటలకు ఉప్లూర్ నుంచి ఏర్గట్ల వరకు పాదయాత్ర అనంతరం కార్నర్ మీటింగ్ అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ గ్రామానికి రాత్రి 9:00 గంటలకు చేరుకుని అక్కడే బస చేస్తారు. 14వ తేదీ ఉ10:00 గంటలకు మంచిప్ప రిజర్వాయర్ సందర్శించనున్నారు. ఇక సాయంత్రం 4:00 గంటలకు పాదయాత్ర మోపాల్ నుండి కంజర్ - కులాస్ పూర్-ముల్లంగి – గన్ పూర్ మీదుగా సాగుతుంది. సాయంత్రం 7:00 గంటలకు డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక రాత్రి 9 గంటలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నిజామాబాద్ నగరానికి చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. 15వ తేదీన ఉదయం 9:00 గంటలకు కంఠేశ్వర్ శివాలయం దర్శనం చేసుకుని ఉ 10:00 గంటలకు దుబ్బ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) ,సెవెజ్ ట్రిట్ మేంట్ ప్లాంట్ (STP) సందర్శిస్తారు. అనంతరం ఉ 11:00 గంటలకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించనున్నారు రేవంత్ రెడ్డి. 12:00 గంటలకు మల్లారంలోని ప్రభుత్వ భుమిని పేదలకు పంచకుండా విక్రయించిన స్థలాన్ని పరిశీలించనున్నారు. సాయంత్రం 4:30 దుబ్బా చౌరస్తా - కెనాల్ కట్ట - నిర్మలా హృదయ కాన్వెంట్ - నామ్‌దేవ్ వాడ - రావూజీ సంఘం - సతీష్ పవార్ చౌరస్తా - శివాజీ చౌక్ - రైల్వే ఫ్లై ఓవర్ వంతెన - దేవి రోడ్ - భగత్ సింగ్ చౌరస్తా - జవహర్ రోడ్డు - పూసాల గల్లి - తుమ్మ బుచ్చయ్య క్రాస్ రోడ్డు – గోల్ హనుమాన్ దేవాలయం - ఆర్య సమజ్ - బడా బజార్ - ఆజం రోడ్  నెహ్రూ పార్క్ వరకు పాదయాత్ర చేసి అక్కడే కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బోధన్ నియోజకవర్గం శాటాపూర్ చేరుకుంటారు అక్కడ బస చేసి 16వ తేదీ ఉ 9:00 గంటలకు సారంగాపూర్ వద్ద ప్రాణహిత-చేవెళ్ల పంపు హౌస్ ను సందర్శిస్తారు. ఉ 10:00 గంటలకు నవీపేట్ గ్రామంలో మార్కండేయ ఆలయ సందర్శన అనంతరం  రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి తిరిగి సాయంత్రం 4:00 గంటలకు ఎడపల్లి వివేకనంద విగ్రహం నుండి బోధన్ అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర చేసి అనంతరం కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు ఆర్మూర్ నియోజకవర్గానికి చేరుకుని పెర్కిట్ హైవే పక్కన బస చేస్తారు. 17-03-2023 ఉ 9:00 గంటలకు సిద్దుల గుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు  పెర్కిట్ నుండి మామిడిపల్లి –  ఆర్మూర్ కొత్త బస్టాండ్ –అంబేద్కర్ చౌరస్తా - పాత బస్టాండ్ వరకు పాదయాత్ర చేసి అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి ఇక్కడితో రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ముగుస్తుంది.