Tiger in Komaram Bheem Asifabad district | సిర్పూర్: పెద్దపులి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ రెండు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులి రైలు పట్టాలు దాటుతూ కనిపించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మాకుడి వద్ద పులి కనిపించగా పరుగులు పెట్టి మరీ సెల్ ఫోన్లకు పని చెప్పారు స్థానికులు.


కొన్ని రోజులుగా దొరకని పులి జాడ


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలోని ఇటుకల పహాడ్ సరిహద్దు ప్రాంతంలో మకాం వేసిన పెద్దపులి గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. ఇదివరకే అన్నూర్ వద్ద రైలు పట్టాలు దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. తాజాగా పెద్దపులి అన్నూర్ వద్ద రైలు పట్టాలు దాటి వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని తర్వాత పులి ఎక్కడా కనిపించలేదు.


రైలు పట్టాలు దాటుతూ కనిపించిన పెద్దపులి


తాజాగా బుధవారం మహారాష్ట్రలోని మాకుడి వద్ద రైలు పట్టాలు దాటుతుండగా పెద్దపులి కనిపించింది. అక్కడ సమీపంలో ఉన్నవారు.. పులి రైలు పట్టాలు దాటుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మాకుడి మీదుగా పులి తెలంగాణ ప్రాంతంలోనీ సిర్పూర్ మండల సరిహద్దు ప్రాంతానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు. సిర్పూర్ మండలం నుండి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం పది కిలోమీటర్ల లోపే ఉంది. ప్రస్తుతం ఆ పులి రైల్వే లైన్ దాటి తెలంగాణ ప్రాంతం వైపు వస్తున్నట్లుగా అక్కడి ప్రాంతంలో ఇటుకల పహడ్ లేదా అక్కడి సమీప వాగు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని, ఇటుకల పహాడ్ ప్రాంతవాసులు సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు.


అదే పులి మళ్లీ వాగు దాటుతూ.. సమీప రైల్వే లైన్ దాటి ఇటు తెలంగాణ ప్రాంతంలోకి అటు మహారాష్ట్ర ప్రాంతంలోకి అమృత్ గూడా వైపు వెళ్తూ ఈ ప్రాంతంలోకి వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పులి రాకతో మళ్లీ ఏం జరుగుతుందో అని అంటూ అక్కడి ప్రాంతవాసులు భయపడిపోతున్నారు.


Also Read: Tiger Corridor: ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కారిడార్ ప్రతిపాదన విరమించుకోవాలి - ఎమ్మెల్యే హరీష్ బాబు