విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించాల్సిన విద్యాలయాల ప్రతిభ మసకబారుతోంది. దేశానికి విలువైన వ్యక్తులను అందివ్వాల్సిన యూనివర్సిటీలు సమస్య సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కారణం ఏదైనా సరే సరైన విద్యాబోధన లేక విద్యార్థులకు భవిష్యత్ అంధకారంలోకి నెట్టేస్తోంది. అలాంటి విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ యూనివర్శిటీ ఒకటి. 


 తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలు కొత్త కాదు. ఎప్పుడూ ఏదో వివాదంతో హెడ్‌లైన్స్‌లో ఉంటుందీ తెలంగాణ యూనివర్శిటీ. ఎంత మంది వీసీలు మారుతున్నా యూనివర్శిటీ పాలనలో మాత్రం మార్పు రావడం లేదు. 


వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటే తెలంగాణ యూనివర్శిటీలో వీసీ నియామకానికి ముందు గందరగోళ పరిస్థితులు ఉండేవి. కొత్త వీసి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వస్తాయేమో అన్న ఆశ అందరిలో ఉండేది. కానీ.. వీసీ వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. గతంలో వీసీ నియామకం జరగకముందు పాలన గాడితప్పింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నడిచింది. వర్సిటీకి 6 నెలల క్రితం కొత్త వీసీగా రవీంధర్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. వీసీ వచ్చాక అనేక వివాదాలు తెర మీదికి వచ్చాయ్.


ప్రధానంగా యూనివర్సిటీలో అక్రమ నియామకాల ఇష్యు రచ్చరచ్చగా మారింది. వీసీ వచ్చాక జరిగిన అక్రమ నియామకాలపై రగడ సాగుతోంది. డబ్బులు తీసుకుని నియామకాలు జరిగాయంటూ... అర్హులకు అన్యాయం జరిగిందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై స్పందించిన వీసీ.. అక్రమంగా నియమితులైన వారిని తొలగించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రద్దు చేశారు.


విద్యార్థుల సమస్యలపై పట్టింపేది ?


విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు లేక చాలా మంది బాధలు పడుతున్నారు. గతంలో ఇచ్చిన సౌకర్యాలను కూడా ఇప్పుడు తొలగించారు. దీనిపై విద్యార్థులు గుర్రుగా ఉన్నారు. 



Also Read: సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !


Also Read: ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?


Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం


Also Read: Revanth Reddy: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం


Also Read : ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి