Telangana Election News: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, బీఆర్ఎస్ ను అస్థిర పర్చడానికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.50 లక్షల నగదుతో అడ్డంగా దొరికిపోయాడని కేసీఆర్ (KCR) విమర్శించారు. అలాంటి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో (Kamareddy News) తనపై పోటీకి దిగుతున్నాడని కేసీఆర్ ఆక్షేపించారు. దీనిపై కామారెడ్డి ప్రజలే బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరారు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ (KCR in Kamareddy) పాల్గొన్నారు. విచక్షణతో ఓటు వేయాలని ప్రజలను కోరారు.


రైతు బంధు వద్దని, 24 గంటల కరెంటు వద్దని అనేవాడు కావాలా? రైతులను కడుపులో పెట్టుకొని చూసేవాడు కావాలా? అని అడిగారు. రైతు బంధు వద్దని, 24 గంటల కరెంటు వద్దని అనేవాడు కావాలా? రైతులను కడుపులో పెట్టుకొని చూసేవాడు కావాలా? అని అడిగారు. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని గంప గోవర్ధన్ తనను చాలా సార్లు అడిగారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేయడం దైవకృపగా భావిస్తున్నానని అన్నారు. కేసీఆర్‌ వస్తే ఒక్కడే రారని, ఆయనతో పాటుగా చాలా వస్తాయని అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. కామారెడ్డి పట్టణంతో పాటు పల్లెల రూపురేఖలు కూడా మార్చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.


మా అమ్మది పోసాని పల్లి - కేసీఆర్
తనకు పుట్టినప్పటి నుంచి కామారెడ్డితో ఎంతో అనుబంధం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం కోనాపూర్‌గా పిలుస్తున్న పోసానిపల్లిలో తన తల్లి పుట్టారని గుర్తు చేసుకున్నారు. ఆరుగొండలో మా మేనమామలు ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మతోటి వచ్చినప్పుడు రైలు కట్ట పక్కన బాదల్‌ సింగ్‌ అనే మార్వాడి ఇంట్ల ఉండేది. అడ్తిలో ఆరుగొండకు చెందిన నిమ్మల జివ్వారెడ్డి గారి అడ్తి చాలా ఫేమస్‌ ఉండే. మేం అక్కడ కూడా ఉండే వాళ్లం’ అని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.


తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లో కామారెడ్డికి చెందిన న్యాయవాదులు చైతన్యం చూపించారని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. కామారెడ్డిని జిల్లా చేస్తానని చెప్పా, చెప్పినట్లే చేసుకున్నామని అన్నారు. మెడికల్‌ కాలేజీ కూడా తెచ్చుకున్నామని చెప్పారు. జలసాధన ఉద్యమం 45 రోజులు చేసి.. ఆ ఉద్యమంలో బ్రిగేడియర్లను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి బ్రిగేడియర్‌గా తానే ఉన్నానని.. అది తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.


నామినేషన్లు వేసిన కేసీఆర్


బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM Kcr) గజ్వేల్, కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్ (Gazwel), మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గజ్వేల్ లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ప్రచారం వాహనం పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ కామారెడ్డి చేరుకున్న ఆయన, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, సోమ భరత్ ఉన్నారు.