Latest News In Adilabad District: ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. నిర్మాణ రంగంలో ఉన్న మేస్త్రీలే టార్గెట్‌గా కేటుగాళ్లు పావులు కదుపుతున్నారు. భారీగా డబ్బులు ఆశ చూపించి పెట్టుబడి పెట్టించి ఉడాయిస్తున్నారు.
కేటుగాళ్లు కొందరు తాపీ మేస్త్రీలతో మాట్లాడి వారిని గ్రూప్‌గా ఏర్పడి సొంత వ్యాపారం చేయమని ప్రోత్సహిస్తారు. భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా ఉపయోగించే పొక్లెయిన్ లాంటివి కొనుగోలు చేపిస్తున్నారు. తక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే భారీగా ఆదాయం పొందవచ్చని వాళ్లకు నూరిపోస్తున్నారు.
మేస్త్రీల అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు ఇక్కడ ఏం మోసం ఉంటుందనే చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఒకసారి వారి ముగ్గులు పెడిన తర్వాత వెహికల్ కొన్నాక అసలు మోసం మొదలవుతుంది. కొన్ని నెలల తర్వాత పొక్లెయిన్‌తో ఆదాయం అనుకున్నట్టు రావడం లేదని.. దాన్ని అమ్మేద్దామని మేస్త్రీలకు ప్రపోజల్ పెడతారు. ఏదో మాయ చేసి దీనికి కూడా మేస్త్రీలను ఒప్పిస్తారు.
పొక్లెయిన్ అమ్మే ప్రతిపాదనకు మేస్త్రీలు ఓకే చెబితే... దాన్ని వేరే వాళ్లకు అమ్మేస్తారు. అయితే ఇక్కడే ఈ కేటుగాళ్లు తమ మోసానికి తెర తీస్తారు. పొక్లెయిన్ అమ్మిన తర్వాత కొంత డబ్బులు ఇచ్చి మరికొంత తర్వాత ఇస్తామని చెబుతారు. ఎన్నిసార్లు అడిగినా రేపు మాపూ అంటూ కాలం వెల్లదీస్తారు.
తర్వాత కొన్నిరోజులకు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. మరికొన్ని రోజులకు మనిషులే కనిపించుండా పోతారు. అమ్మేవాళ్లు కనిపించారు. ఇందులో ఇరికించిన వాళ్లు కూడా కనిపించారు. కనిపించినా తమకు తెలియదని... వాళ్లు చెప్పాపెట్టుకుండా వెళ్లిపోయారంటూ మాట మార్చేస్తారు.
వాహనం అమ్మిన డబ్బులు రాక మేస్త్రీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు కొనుగోలు చేసిన ఈఎంఐలు చెల్లించలేక కుంగిపోతున్నారు. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందని కథలు చెప్పి ఇప్పుడు అప్పులు పాల్జేశారని బాధితులు వాపోతున్నారు. ఓవైపు చేతిలో డబ్బుల్లేక, ఈఎంఐలు చెల్లించలేని చాలా మంది పోలీస్‌స్టేషన్‌లను ఆశ్రయించారు. మరికొందరు ఎవరికీ చెప్పుకోలేక సైలెంట్‌గా ఉండిపోతున్నారు.
ఇక్కడ పొక్లెయిన్ కొనుగోలు చేసిన వారంతా ఇతర్రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువమంది ఉంటున్నారు. దీంతో కేసులును ఛేదించడం పోలీసులకు ఇబ్బందిగా మారుతోంది. అందుకే ఏదైనా వాహనం అమ్మితే వెంటనే పేరు మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంట్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
Also Read: నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి కలకలం, కవ్వాల్ అభయారణ్యం నుంచి వచ్చినట్లు అనుమానం