Modi Tour:  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  మంగళవారం నిజామాబాద్​ కు రానున్నారు.  తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీని 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును ఇందూర్​ వేదికగా ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. . నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8,021కోట్ల రూపాయల విలువైన ప్రాజక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మోదీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకుంటుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా పవర్, హెల్త్, రైల్వే ప్రాజక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.1369కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోదీ భూమిపూజ చేస్తారు. ఎయిమ్స్ నూతన భవనానికి శుంకుస్థాపన చేస్తారు.


అనంతరం గవర్నమెంటు ప్రభుత్వ గిరిరాజ్​ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు అని ఆయన చెప్పారు. వర్షం కురిసినా ఇబ్బందిలేకుండా రెండు లక్షల మంది కూర్చునేలా సభను ఏర్పాట్లు  చేశారు. ఈ సభకు మొదట ఇందూరు జనగర్జన పేరు పెట్టారు.. కానీ, పాలమూరు​ వేదికగా రాష్ట్రానికి ప్రధాని మోడీ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో సభను ధన్యవాద్​ సభగా మార్చినట్లు బీజేపీ ప్రకటిచింది.  రైతులు అధిక సంఖ్యలో వచ్చి పసుపు బోర్డు ఇస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలుపాలని నిజామాబాద్  ఎంపీ అర్వింద్​ కోరారు. బహిరంగసభ జరిగే  గ్రౌండ్ ను  ఎస్పీజీ అధికారులు అధీనంలోకి తీసుకున్నారు.                    


ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ టూర్ ఖరారైంది. వచ్చే నెల 3న  కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి ఆయన నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్​కు చేరుకోనున్న మోదీ,  మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:45 గంటలకు సభా స్థలికి చేరుకొని 4.45 గంటల వరకు సభలో ఉంటారు. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్​లో బయలుదేరి బీదర్ చేరుకోనున్నట్లు పీఎంవో వెల్లడించింది. మొత్తం 2 వేలమందికిపైగా పోలీసులు ప్రధాని బందోబస్తులో పాల్గొన్నారు.
 
ప్రధాని మోడీకి చేరువలో ఉండే వ్యక్తులకు ప్రత్యేక పాస్​లు ఎస్పీజీ సిఫారసు మేరకు జిల్లా పోలీసులు జారీ చేస్తున్నారు. నిజామాబాద్​ వచ్చాక ప్రధాని మోడీ 2 గంటల పాటు ఉండనున్నారు. ఎంపీ అర్వింద్​ ఆధ్వర్యంలో బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. బీజేపీ సభకు మూడు కిలోమీటర్ల దూరం వరకు ఆంక్షలు, ప్రతి ఒక్కరి కదలికలపై ఎస్పీజీ అధికారులు నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ ను నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించారు. 2 వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చూస్తున్నారు.  సభా స్ధలీ, హెలిప్యాడ్ స్ధలాన్ని తమ ఆధీనంలో కేంద్ర బలగాలు, ఎస్పీజీ అధికారులు తీసుకున్నారు.