Marriage Cancelled For Leg Bones : వివాహా కార్యాల్లో చిన్న చిన్న విషయాలకే వధువు, వరుడు బంధువులు తగువులాడుతుంటారు. ఎవరికి వారే తాము గొప్పంటే తామే గొప్పంటూ వాదించుకుంటూ ఉంటారు. చిన్న గొడవలు కాస్తా పెద్దవై...తిట్టుకోవడం, కొట్టుకోవడం అనేక పెళ్లిళ్లలో చూస్తుంటాం. ఆ తర్వాత పెద్దలు వచ్చి సర్దిచెబితే, రెండు వర్గాలు కాంప్రమైజ్ అయిపోతుంటాయి. మరికొన్ని సందర్బాల్లో మాత్రం ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో వివాహాలే రద్దు అయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 


నిజామాబాద్‌ (Nizamabad)జిల్లాకు చెందిన అమ్మాయితో జగిత్యాల ( Jagitial) జిల్లా మెట్‌పల్లి అబ్బాయికి వివాహం కుదిరింది. కట్నకానుకలు మాట్లాడుకున్నారు. పెళ్లి (Marriage)కి ముహూర్తాలు పెట్టుకోవాలని ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించారు. అమ్మాయి ఇంట్లో ఎంగేజ్ మెంట్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో మాంసాహారం భోజనాలు వడ్డించారు. అక్కడే లొల్లి షురూ అయింది. అబ్బాయి బంధువులు  మూలుగ బొక్క కావాలని అడిగారు. వడ్డించే వారు ఆ బొక్క వేయకపోవడంతో గొడవ పెద్దదై పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అటు అబ్బాయి, ఇటు అమ్మాయి బంధువులు పంతానికి వెళ్లడంతో చివరికి పెళ్లే క్యాన్సిల్ అయింది.


గతంలో ఒడిషాలో సంబల్‌పూర్ జిల్లాలోని ధామాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మటన్ కోసం గొడవ పడటంతో పెళ్లికూతురు వివాహాన్ని రద్దు చేసింది. వరుడి, అతని స్నేహితులు మటన్‌ కోసం దురుసుగా ప్రవర్తించడంతో అమ్మాయి షాకిచ్చింది. ఒడిశా సంబల్‌పూర్ జిల్లాలోని ధామా ప్రాంతంలో జరిగింది. పెళ్లి అయిపోయిన తర్వాత వరుడి స్నేహితులు ఆరుగు భోజనాలకు వచ్చారు. వారు వచ్చే సమయానికే మటన్ అయిపోయింది. దీంతో వారు పెళ్లికూతురు కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. మటన్ కూర వడ్డించాల్సిందేనంటూ వధువు తండ్రిని నానా మాటలతో అవమానించారు. దీనికి వరుడు కూడా అతని స్నేహితులకే వంత పాడడటంతో, ఆగ్రహించిన వధులు పెళ్లిని రద్దు చేసింది.  అంగరంగవైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతుంటాయి. రుచికరమైన వంటకాలు వడ్డిస్తారు. పెళ్లికి వచ్చినవారికి లేదనకుండా భోజనాలు పెడతారు. చిన్న విషయాలకు తగువు పడి పెళ్లి రద్దు చేసుకోవడం ఈ మధ్య పెరిగిపోయాయి.