Food poisoning in Mancherial district | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ అవడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమ పాఠశాల సిబ్బంది అధికారులకు సమాచారం అందించడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు.


ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో ఓ స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల ఆసుపత్రిలోనే వారు చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లోని భోజనం తిని పలువురు విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఆస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు మృతి చెందారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి మృతి సంచలనంగా మారింది. అంతలోనే మంచిర్యాల జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలోనూ ఫుడ్ పాయిజన్ జరగడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.



ఉన్నతాధికారులు హాస్టల్ సిబ్బంది నాణ్యమైన భోజనం పై శ్రద్ధ వహించాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా జాగ్రత్త వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బయటి మార్కెట్లో హోటళ్లలో కల్తీ నూనె కల్తీ వస్తువుల వాడకం జరుగుతోందని దీంతోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది రోజు హోటళ్లను పర్యవేక్షణ చేస్తూ ఉండాలని ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలలో కల్తివిక్రయాలు జరుగుతున్నాయని వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Also Read: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు