Nizamabad MP Dharmapuri Arvind: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో ఉన్న ఎంపీ అర్వింద్ ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం వడ్లను కొనడం లేదని నిరసనలు తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎంపీ నివాసం ముందు కొందరు ధాన్యం కుప్ప పోసి నిరసన తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరతానని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతులకు బాండ్ రాసిచ్చి మోసం చేసిన ఎంపీ అర్వింద్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కోనుగోలు చేసేలా చేయాలని డిమాండ్ చేశారు. గులాబీ కార్యకర్తలు ఎంపీ ఇంటి వద్ద నిరసనకు దిగడంతో అక్కడికి బీజేపీ నాయకులు భారీగా చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనిని బీజేపీ నాయకులు ఖండించారు.







ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రైతుల ముసుగులో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. రోజురోజుకు ప్రజలలో ఆదరణ తగ్గుతుందన్న భయంతో జీవన్ రెడ్డి ఇలా రైతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు సొసైటీ సభ్యులు ఉన్నారని అన్నారు. ఢిల్లీలో రైతు ధర్నాల పేరుతో గులాబీ నేతలు దావతులు చేసుకున్నారని అన్నారు.