నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్‌ కలకలం రేపుతోంది. పాజిటివ్ కేసులు నమోదైన తర్వాత కూడా స్కూల్‌ నడుస్తోంది. విషయం బయటకు తెలియకుండా స్కూల్‌ యాజమాన్యం మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. కేసులు వచ్చిన తరగతి విద్యార్థులకు మాత్రమే రెండు రోజులు సెలవులు ఇచ్చారు. వాళ్లు మినహా మిగిలిన వాళ్లతో స్కూల్ రన్ చేశారు. తరగతులను యథావిధిగా నడిపించేశారు.


కరోనా వచ్చిన స్కూల్‌లో దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటారు. ఆ క్యాంపస్‌లోనే జూనియర్ కాలేజీ కూడా రన్ చేస్తోంది యాజమాన్యం. కరోనా కేసులు నమోదవుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా స్కూల్‌కు సెలవులు ఇవ్వకుండా నడిపించడంపై అటు తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.


నర్సరీ నుంచి హై స్కూల్ వరకు ఒకే క్యాంపస్‌లో ఉంది. చిన్నపిల్లలు కూడా అదే క్యాంపస్‌లో ఉంటారు. ఆ క్యాంపస్‌కు సంబంధించి పిల్లల మరుగుదొడ్లు తక్కువగానే ఉన్నాయ్. వైరస్ మిగతా పిల్లలకు వ్యాపించక ముందే తీసుకోవాల్సిన చర్యలను యాజమాన్యం గాలికొదిలేసిందన్న ఆరోపణలు వస్తున్నాయ్. సరైన కోవిడ్ నిబంధనలు పాటించటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్‌కు వచ్చే సమయంలో స్కూల్ నుంచి విద్యార్థులను వదిలిపెట్టే సయమంలో ఒకేసారి విద్యార్థులను వదలటంతో వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.


ఇంత జరుగుతున్నా యాజమాన్యం స్కూల్ ను బంద్ చేయకుండా పరీక్షల పేరుతో స్కూల్ ఫీజులు కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిళ్లు తెస్తున్నారని పేరెంట్స్ చెబుతున్నారు. విద్యార్థులకు కరోనా వచ్చిందన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను స్కూల్ కు పంపటం లేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు సైతం చర్యలు తీసుకోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయ్. మొన్నటికి మొన్న నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూడా ఓ టీచర్, విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ కేసులు ఈ నేపథ్యంలో స్కూళ్లపై అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు.


Also Read: శ్రీవారికి రూ. మూడున్నర కోట్ల విలువైన ఆభరణాల విరాళం ఇచ్చిన ఆజ్ఞాత భక్తుడు !


Also Read: సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !


Also Read: ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?


Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం


Also Read: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి