Adilabad BJP Candidate: హైదరాబాద్: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పై ఎన్నికల కమిషన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షాపై సైతం ఫిర్యాదు చేశారు. కేంద్రంలోనే కాదు తెలంగాణలోనూ ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. 


ఎంపీ అభ్యర్థి అఫిడవిట్ లో ఖాళీలు.. 
ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఇటీవల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో అన్నీ కాలమ్స్ ఫిలప్ చేయలేదని రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కానీ బీఆర్ఎస్ ఫిర్యాదును రిటర్నింట్ అధికారి పట్టించుకోలేదు అని వారు చెబుతున్నారు. ఈ విషయంపై తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ‌ను BRS నేతలు దాసోజు, ఆశిష్ కలిశారు. ఎన్నికల అఫిడవిట్ లో అన్నీ కాలమ్స్ నింపలేదని గోడ నగేశ్ పై, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రిటర్నింగ్ అధికారిపై వికాస్ రాజ్ ను రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 


ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..  ఎపీ అభ్యర్ధి గోడం నగేశ్ పై, రిటర్నింగ్ ఆఫీసర్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా  పనిచేస్తోందని ఆరోపించారు. నగేష్ నామినేషన్ తిరస్కరించడానికి అన్ని ఆధారాలు చూపించినా, ఆర్వో బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు 
వీహెచ్‌పీ నేతలు సీఈవో వికాస్ రాజు కలిశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై EC కి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని VHP జాతీయ కార్యవర్గ సభ్యుడు రామరాజు అన్నారు. దేవుని పేరుతో అక్షంతలు ఆశచూపుతూ ఓట్లు వేసుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై VHP అభ్యంతరం తెలిపింది. అనంతరం వీహెచ్‌పీ సభ్యులు మాట్లాడుతూ.. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. కేసీఆర్ ఇక ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.