YS Jagan Attends Minister Botsa Son Wedding: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. నేటి ఉదయం పది గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు వచ్చిన జగన్ .. హైటెక్స్ లోని కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్ వివాహానికి హాజరయ్యారు. వరుడు సందీప్, వధువు పూజితలను ఏపీ సీఎం జగన్, భారతీ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు.
వివాహ విందు అనంతరం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళుతున్నారు. సీఎం జగన్ నేడు రాగా, మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహాని (Botsa Satyanarayanas Son Marriage)కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ కేబినెట్ మంత్రులు సైతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. బొత్స కుమారుడు సందీప్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
మంత్రి బొత్స తనయుడు వివాహానికి దాదాపు 90 శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలకు చెందిన ఎమ్మెల్యేలు వీఐపీలు, వీవీఐపీలను రిసీవ్ చేసుకుంటూ మంత్రి బొత్స తనయుడి వివాహంలో బాధ్యతలు పంచుకున్నారు.
వైఎస్ జగన్ వారంలో రెండోసారి..
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది (Statue Of Equality) సమారోహ ఉత్సవాలలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో ఫిబ్రవరి 7న ఏపీ సీఎం పాల్గొన్నారు. పూజ ముగిసిన అనంతరం సీఎం జగన్ ఏపీకి వెళ్లిపోయారు. అదే విధంగా ఫిబ్రవరి 8న కేంద్ర మంత్రి అమిత్ షా, 9న మోమన్ భగవత్, ఈ 10న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముచ్చింతల్ దర్శించుకున్నారు. నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, 12న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఈ 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముచ్చింతల్‌లోని సమతామూర్తిని దర్శించుకోనున్నారు.
Also Read: Perni Nani Meet Mohanbabu : మోహన్‌బాబుతో పేర్ని నాని భేటీ - టాలీవుడ్ సమస్యలపై చర్చ !
Also Read: Chandrababu : ఇక ఏపీ ఉండదన్నట్లుగా ఆస్తులు అమ్మేస్తున్నారు - సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు !