Yadadri Temple: ఆదివారం సెలవు దినం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక్క యాదాద్రికే కాదండోయ్.. వేములవాడ రాజన్న ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరవి వచ్చారు. వేకువ జాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడం, అందులోనూ వారాంతం కావడంతో చాలా మంది పిల్లలతో సహా స్వామి వారి దర్శనానికి వచ్చారు. గంటల తరబడి ఓపికగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. 


వేములవాడ రాజన్న సన్నిధిలోనూ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వారాంతం కావడంతో వేలాది మంది భక్కులు రాజరాజేశ్వర స్వామి దర్శించుకునేందుకు తరలి వచ్చారు. కోడె మొక్కుల కోసం బారులు తీరారు. స్వామి వారి దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతోంది.