Water Mixed With Petrol In Telangana:

  తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ తో పాటు నీళ్లు కలిసి వస్తున్నాయని, వాటి వల్ల తమ వాహనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. లీటర్  సూర్యాపేటలోని జనగాం క్రాస్ రోడ్డులోని దుర్గాభవాని పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగారు. నీళ్లు కలిసిన పెట్రోల్ ను బాటిల్స్ లో చూపించారు. నరేష్ అనే వ్యక్తి 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకుని కాస్త దూరం వెళ్లాక.. బండి ఆగిపోయి మళ్లీ స్టార్ట్ కాలేదు. ట్యాంక్ లోని పెట్రోల్ తీసి బాటిల్ లో పోసి చూస్తే నీళ్లు కనిపించాయి. వెంటనే దుర్గాభవాని పెట్రోల్ బంక్ కు వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ సమీపంలోని నయారా పెట్రోల్ బంకులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. న్టీఆర్ చౌక్ లోని పెట్రోల్ కొట్టించుకున్న వారి వాహనాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. వారు కూడా బంక్ వద్ద ఆందోళన చేశారు.


సూర్యాపేట: పెట్రోల్‌లో నిమ్మకాయ రసం, రంగు నీళ్లు వస్తున్నాయని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట పురపాలిక పరిధిలోని జనగాం క్రాస్‌రోడ్డులో ఉన్న దుర్గా భవాని పెట్రోల్‌ బంక్‌ వద్ద శనివారం జరిగింది. బాటిల్‌, బకెట్‌లో పట్టించి చూడగా బకెట్‌ల కొద్ది నీటిలో కొద్దికొద్దిగా పెట్రోల్‌, డీజిల్‌ కలిసి రావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలెంల గ్రామానికి చెందిన తంతెనపల్లి నరేష్‌ రూ.100 పెట్రోల్‌ తన బైక్‌లో కొట్టించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని కలిసేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి రావడానికి ఎంత ప్రయత్నించినా బైక్ స్టార్ట్ కాలేదు. 
లీటర్ పెట్రోల్ లో 750 ఎంఎల్ నీళ్లు..
వాహనంలోంచి పెట్రోల్‌ తీసి బాటిల్ పట్టి చూడగా అందులో పెట్రోల్ కంటే నీళ్లే ఎక్కువగా ఉండటంతో వాళ్లు షాకయ్యారు. మరో బంక్‌కు వెళ్లి పెట్రోల్ కొట్టించుకుని దుర్గాభవాని బంక్‌కు వెళ్లి, నీళ్ల పెట్రోల్ పోస్తున్నారని, వాహనాలు పాడవుతున్నాయని బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరో ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకొని తమ వాహనాలు కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయని, ఆ తరువాత స్టార్ట్‌ కావడం లేదని దుర్గా భవాని పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. బంక్ సిబ్బందికి చెప్పి ఓ బాటిల్ లో అప్పటికప్పుడు పెట్రోల్ పట్టి చూడగా లీటర్ బాటిల్ లో ముప్పావు లీటర్ (750 ML) నీళ్లు వచ్చాయి. ఇమాంపేట హెచ్‌పీసీఎల్‌ బంకు నుంచి 4 వేల లీటర్ల పవర్‌ పెట్రోల్‌ వచ్చిందని.. పవర్‌ పెట్రోల్‌ కలుషతం అయిందని, సాధారణ ఇంధనం బాగానే ఉందని ఇందులో తమ తప్పు ఏమీ లేదని బంక్ సిబ్బంది వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి వేగంగా చర్యలు తీసుకోవాలని లేని లేకపోతే బాధిత వాహనదారులు అందరూ కలిసి పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు బంక్ వద్దకు చేరుకుని వాహనదారులకు సర్దిచెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వాహనదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


సగం పెట్రోల్, సగం నీళ్లు.. బాధితుల ఆందోళన
పెట్రోల్ లో నీళ్లు వస్తున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ సమీపంలోని నయారా పెట్రోల్ బంకులో వినియోగదారులు ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ పోసుకోగా ఒక్క లీటర్లో సగం లీటర్ నీళ్లు వచ్చాయాని పెట్రోల్ బంకు వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ పెట్రోల్ పోసుకున్న వినియోగదారులు తమ ద్విచక్ర వాహనం మధ్యలోనే ఆగిపోయిందని ఒక్కొక్కరు వస్తుండటంతో.. యాజమాన్యం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే పెట్రోల్ కల్తీ అమ్ముతున్నారని వినియోగ దారులు ఆరోపిస్తుండగా యాజమాన్యం మాత్రం పెట్రోల్ లో ఇతనాయిల్ ఎక్కువ కలువటం వల్లనే నీళ్ల లాగా కనిపిస్తుందని అంటున్నారు.. మొత్తానికి ఇక్కడ పెట్రోల్ పోసుకున్న వినియోగదారులు మాత్రం తమ ద్విచక్ర వాహనాలు ఆగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.