తెలంగాణలో అధికారిగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ ఉద్యోగిపై సర్కార్ చర్యలు తీసుకుంది. ప్రభుత్వానికి అభ్యంతరమైన వ్యాఖ్యలు చేసిన సూర్యాపేట జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను పంచాయితీ రాజ్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఆయన వెంటనే కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. సూర్యాపేట జడ్పీ సీఈఓగా స్థానిక ఆర్డీఓ రాజేంద్రకుమార్‌కు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లాలో ఆదివారం నాడు వివిధ చోట్ల టీచర్స్ డేను నిర్వహించారు. ఇలాగే సూర్యాపేటలోని సిద్ధార్థ హైస్కూల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి సూర్యాపేట జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యావ్యవస్థ దారుణంగా ఉందని అన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థలు చెప్పిందే ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన విమర్శించారు. 


Also Read: Haryana Crime: ఫ్యామిలీనే చంపేసిన ముద్దుల కొడుకు, హోటల్‌ రూంలో ఫ్రెండుతో.. ఈ ‘గే’ కథ ఘోరం!


నారాయణ, చైతన్య కాలేజీ యాజమాన్యాలే స్కూల్స్ నడపమంటే ప్రభుత్వం నడుపుతోందని ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బొత్తిగా విద్యా వ్యవస్థ బాగోలేదని వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థ తీరు మారకపోతే తన ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని తాజా చర్యలు తీసుకుంది.


Also Read: Khammam: ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘సన్‌’ స్ట్రోక్ తగులుతుందా? వివాదాస్పదంగా కుమారుల తీరు


ఇంకా ఆ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లు చెప్పినట్లు వింటుండడం దారుణమని అన్నారు. కార్పొరేట్ స్కూల్స్‌కు ఉన్న ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లు తెరిస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందనే ఆలోచనలో ప్రభుత్వ ఉండడం దారుణని విమర్శలు చేశారు. విద్యా రంగాన్ని మార్చేందుకు అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.


Also Read: Telangana Inter: ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ ఖరారు.. పరీక్షలు, సెలవులు ఈ తేదీల్లో..


Also Read: Pastor Arrest: హైదరాబాద్ లో కీచక పాస్టర్ అరెస్ట్... మత బోధనల పేరుతో మాయమాటలు... మోసపోయిన ముగ్గురు యువతులు!