Telangana Elections News: కాంగ్రెస్ నాయకులు బాగా బలిసి కొట్టుకుంటున్నారని, కర్ణాటక నుంచి కాంట్రాక్టర్ల నుంచి బాగా పైసలు వచ్చిపడుతుండే సరికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎగిరెగిరి పడుతున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంచులు ఎక్కువ అవడంతో మిడిసి పడుతున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ (KTR Latest News) నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR Comments) మాట్లాడుతూ.. అరవై ఏళ్లు కాంగ్రెస్ పాలనలో గోస తీసినమని అన్నారు. మూడోసారి కేసీఆర్ గెలిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని మంత్రి కేటీఆర్ (KTR) చెప్పారు.
‘‘తెల్ల కార్డు ఉంటే కేసీఆర్ బీమా ఇస్తాము. రైతు కూలీలకు భూమి లేకున్నా కేసీఆర్ బీమా వస్తుంది. అన్నపూర్ణ స్కీం కింద పేదలకు సన్న బియ్యం ఇస్తాము. వండి పెట్టుడు, మూతి తుడుచుడు తప్ప మొత్తం కేసీఆర్ ఇస్తాడు. ప్రతి ఆడబిడ్డలకు నెలకు మూడు వేలు ఇస్తాము. డిసెంబర్ 3 తర్వాత రైతు బంధు రూ.16 వేలు వస్తుంది. నకిరేకల్ (Nakrekal Assembly constituency) నియోజకవర్గంలోనే రైతు బంధుకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినం. ఇక్కడ చిరుమర్తి లింగయ్యను గెలిపిస్తే చిట్యాలలో (Chityala News) పాలిటెక్నిక్ కళాశాల వస్తది.
చిట్యాల ప్లై ఓవర్, బ్రాహ్మణ వెళ్లెంల పూర్తి కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వెయ్యండి. ఉదయ సముద్రం, పిల్లాయిపల్లి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కాంగ్రెస్ కు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవడో తెలియదు. పోటీలో లేని జానారెడ్డి ముఖ్యమంత్రి అంట. ఉత్తమ్ గెలవక పోతే గడ్డం తీయను అన్నాడు. నల్గొండలో గెలిచేది కంచర్ల భూపాల్ రెడ్డే. మునుగోడులో గెలిచేది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే. డబ్బు మదం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఓటమి తప్పదు. తెలంగాణలో రేవంత్ మూడు గంటల కరెంటు చాలు అంటుండు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. అంటే అరు నెలకు ఒక సీఎం గ్యారంటీ’’ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు.