హోలి ( Holi ) అంటే రంగులు చల్లుకోవడమే మనం అందరం అనుకుంటాం. కానీ మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కుకు ( MLA Sankar Naik ) హోలీ అంటే ఇంకో సంబరం కూడా ఉంది. అదేమిటంటే.. అనుచరులకు స్వయంగా నోట్లో మద్యం పోయడం.  హోలీ సందర్భంగా మహబూబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ( MLA Camp Office ) సంబరాలు ఏర్పాటు చేశారు శంకర్ నాయక్. నియోజకవర్గం మొత్తం నుంచి అనుచరుల్ని ఆహ్వానించారు. క్యాంప్ ఆఫీసులో ఘనమైన ఏర్పాట్లు చేశారు. అంటే రంగులు.. నీళ్లు మాత్రమే కాదు..  తీర్థం కూడా. అంటే మద్యం అన్నమాట. 


తెల్లారేసరికల్లా ఆర్టీసీ ప్రయాణికులకు షాక్, టికెట్ ధరలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ


ఎమ్మెల్యేనే రంగులు పూసుకుందాం అని ఆహ్వానించిన తర్వాత రాకుండా ఉంటారా... వందల మంది అనుచరులు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక ప్రజా ప్రతినిధులు. ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు ఇలా అందరూ ఉన్నారు. అందరితో కలిసి హోళీ అడిన శంకర్ నాయక్ డాన్సులు కూడా వేశారు. అయిపోయిన తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని నిర్ణయించుకుని.. క్యాంప్ ఆఫీసులో  అప్పటికే తెచ్చి ఉంచిన మద్యం బాటిళ్లను (  Liqour ) ఓపెన్ చేశారు.  అనుచరులు ఒక్కొక్కరుగా నోరు తెరుస్తూంటే.. వారి నోళ్లలో ఆయన మద్యం పోస్తూ పోయారు. 


ఇదెక్కడి చోద్యం ! పారిపోవడానికి ప్రయత్నించి, ఆపై లాఠీ లాక్కుని ఆబ్కారీ ఎస్సైపై దాడి


బాటిల్ ఓపెన్ చేసి అలా మద్యాన్ని నోట్లో పోయడం చూసిన చాలా మంది సినిమాల్లో ఐటం సాంగ్‌లను గుర్తు చేసుకున్నారు. అక్కడ ఎవరూ అలా మద్యం తాగడాన్ని ఎమ్మెల్యే స్వయంగా పోయడాన్ని తప్పు పట్టలేదు. డాన్స్ లేస్తూ చిందులేస్తూ.. పండగ చేసుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా వారితో కాలు కలిపారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు మందుమత్తులో చిందేసి , తూలిపోయారు ప్రజా ప్రతినిధులు .


నోటిఫికేషన్లు వస్తున్నాయి చదువుకోండి, యువతకు అధికార పార్టీ నేతల సూచన, ఇప్పుడే అంత శ్రద్ధ ఏంటన్న విపక్షాలు


ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు  వివాదాలేం కొత్త కాదు. ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాల్లేకపోతేనే కొత్తగా ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసులకెళ్లి అధికారుల కుర్చీల్లో కూర్చోవడం.. లాంటి పనులే కాదు.. ఏకంగా మహిళా కలెక్టర్‌తోనూ అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఉన్నా ఆయన రాజకీయాలు ఆయన చేస్తూనే ఉన్నారు.