Attack on Excise SI: మందుబాబులు రోజురోజుకూ చెలరేగిపోతున్నారు. మద్యం, సారా సేవించి మామూలుగా ఉండకుండా అధికారులపై దాడులకు దిగుతున్నారు. ఆ మధ్య ఏపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నాటు సారా కాచే బ్యాచ్‌పై తనిఖీకి వెళ్లిన పోలీసులపై తిరగబడ్డారు. వాగ్వివాదానికి దిగిన వారు అంతటితో ఆగకుండా ఓ ఎక్సైజ్ శాఖ అధికారిపై దాడికి పాల్పడ్డారు. కొట్టవద్దు అని వారిస్తున్నా వినకుండా నాటు సారా తరలిస్తున్న పడవలోనే అధికారిపై భౌతిక దాడులకు దిగారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మందుబాబులు బీభత్సం చేశారు.


నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పురాణీపేట్‌ శివారులో ఆబ్కారీ శాఖ ఎస్సై, ఓ కానిస్టేబుల్‌పై మందుబాబులు భౌతిక దాడులు చేశారు. నాటుసారా విక్రయ కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేయడానికి వెళ్తే సీన్ రివర్స్ అయింది. అధికారులను చూసి పారిపోవాల్సిన గుడుంబా కాస్తున్న వ్యక్తులు ఏకంగా వారిపై ఎదురుదాడికి దిగారు. పోలీసుల చేతుల్లోని లాఠీని సైతం గుంజుకుని ఎస్సై, కానిస్టేబుల్‌ను కొట్టారు.


నాటుసారా కాస్తున్న చోటుకు ఆకస్మిక దాడులకు వెళ్లగా జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గుడుంబా కాస్తున్నారనే సమాచారం అందడంతో భీంగల్ ఆబ్కారీశాఖ ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్‌ ఓ వాహనంలో అక్కడికి తనిఖీకి వెళ్లారు. మొదట ఎక్సైజ్ శాఖ పోలీసులను గుర్తించి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఉండగా.. వాహనాన్ని చూసి ముగ్గురు పారిపోయారు. నాలుగో వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎస్సై, కానిస్టేబుల్ అతడ్ని పట్టుకున్నారు. 


ముగ్గురు వెనక్కి వచ్చి వీరంగం..
గుడుంబా కాస్తున్న నిందితులు మొదట పోలీసుల్ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. తమ బ్యాచ్‌కు చెందిన ఓ వ్యక్తి దొరకడంతో మిగతా ముగ్గురు వెనక్కి తిరిగొచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఓ వ్యక్తి ఎస్సై చేతిలో ఉన్న లాఠీని లాక్కున్నాడు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అదే లాఠీతో ఎస్సై, కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఎక్సైజ్ శాఖ ఎస్సై  నర్సింహులు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు భీమ్‌గల్‌ ఎస్సై శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకోలేదని ఆరోపణలున్నాయి.
Also Read: Car Thief Shekawat Arrest : " పట్టుకోండి చూద్దాం " అని పోలీసులకే సవాల్ చేశాడు.. చివరికి దొరికిపోయాడు ! ఇప్పుడేం జరుగుతుంది ?


Also Read: Sharapova Schumacher fraud : షరపోవా, షూమాకర్‌లపై ఢిల్లీలో చీటింగ్ కేసు ! ఆ స్పోర్ట్స్ స్టార్లు ఇంత చీటర్లా ?