Horoscope Today 18th March 2022: హోలీ ఏ రాశివారిజీవితాల్లో కలర్స్ నింపుతుందంటే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

Continues below advertisement

మార్చి 18  శుక్రవారం రాశిఫలాలు

Continues below advertisement

మేషం 
ఏ పనీ పూర్తి కాకపోవడం వల్ల అసంతృప్తికి లోనవుతారు.ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఎవరితోనైనా వివాదాలు తలెత్తవచ్చు.

వృషభం
మీరు కుటుంబ సభ్యుల మద్దతుతో ప్రయోజనం పొందుతారు. యువత ఈరోజు సరదాగా ఉంటారు. ఇంటి పనులు పూర్తి చేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయివేటు కంపెనీలో పనిచేసే వారికి ఈ రోజు కలిసొస్తుంది. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదం. ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతారు. 

మిథునం
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు.  కుటుంబ సభ్యుల అంచనాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మనోభావాలను పరిగణలోకి తీసుకోండి.  ఈరోజు మీరు ఆకస్మికంగా డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు అవుతుంది.

Also Read: హోలీ రోజు మగాళ్లని చితక్కొట్టేయడమే అక్కడి వేడుక

కర్కాటకం
ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటికి అతిథులు వస్తారు. మీ దినచర్యను క్రమశిక్షణలో ఉంచుకోవాలి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. పాత మిత్రులను కలుస్తారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు.  ప్రేమ సంబంధాలలో ఒత్తిడి ఉంటుంది.

 సింహం
కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మీరు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు అన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంతోషంగా ఉంటారు. ప్రేమికులకు మంచిరోజు కాదు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం.

కన్య
ఈరోజు మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు.  అధికారులను కలుస్తారు. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  పనికిరాని వాటిపై సమయాన్ని వృథా చేయకండి. శారీరక బాధల వల్ల ఇబ్బంది ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.

తుల  
ఒకరి మాటల వల్ల మీ మనస్సు కలతచెందుతుంది.  శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని తప్పుడు పనులు చేస్తారు.  గృహ ఖర్చులు పెరగడం వల్ల మీ నెలవారీ బడ్జెట్ ప్రభావితమవుతుంది. మీరు స్నేహితులతో చర్చించవచ్చు. ఆధ్యాత్మికతవైుపు ఆసక్తి చూపిస్తారు.  యోగా-వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం
రాజకీయ వ్యక్తులు లాభపడతారు, ఉన్నత పదవిని పొందుతారు. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పేందుకు ఇదే మంచిసమయం. వ్యాపారంలో మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు.  నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. టెన్షన్ తగ్గుతుంది. 

ధనుస్సు 
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మీరు పొట్ట సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యుల విమర్శలను పట్టించుకోవద్దు.  వినోదం కోసం ఖర్చు చేస్తారు. బంధువులను సందర్శిస్తారు.  మీ పూర్వీకుల వివాదాలు పరిష్కారమవుతాయి.

Also Read: ప్రేమ వికసించి కామం దహనమైన రోజు - హోలీ అంటే రంగులు చల్లుకోవడమే అనుకుంటే ఎలా

మకరం
ఉన్నతంగా ఆలోచించండి. ఎవరినీ దుర్భాషలాడవద్దు. ఉద్రిక్తత ఏర్పడవచ్చు. ఎవరితోనూ అస్పష్టంగా మాట్లాడకండి. మీరు విమర్శలకు గురవుతారు. ప్రయాణం చేసే ఆలోచనలు చేయవచ్చు. మీపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.

కుంభం
మీకు ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. డబ్బు సమస్య తీరుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. బంధువులను కలుస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ దినచర్యలో మార్పులు చేయడానికి ప్రయత్నించండి.

మీనం 
భవిష్యత్ ప్రణాళికల విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన సమస్యను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి.  స్నేహితులను కలుస్తారు. పేద ప్రజలకు సహాయం చేస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

Continues below advertisement