మహబూబా బాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ( MLA Sankar Naik ) ప్రవర్తన మరోసారి వివాదాస్పదమయింది. ఎంపీ కవిత మాట్లాడుతూండగా.. తాను మాట్లాడాలంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాగేసుకున్నారు. ఆయన ప్రవర్తన చూసి టీఆర్ఎస్ నేతలకు (TRS Leaders ) షాక్ తగిలినట్లయింది. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం తీరుపై హైకమాండ్ ఆదేశం మేరకు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం గేటు ముందు టీఆర్ ఎస్ సభ ( TRS Meeting ) ఏర్పాటు చేశారు. రైతులతో కలిసి నిరసన దీక్ష లో మంత్రి సత్యవతి రాథోడ్,ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్ లు,ఎమ్మెల్సీ రవీందర్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు,జేడీపీటీసి లు,పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ధర్నాలో అందరూ ప్రసంగించారు. ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తూ వెళ్లారు. హోదాల ప్రకారం ముందుగా మంత్రి.. తర్వాత ఎంపీ.. తర్వాత ఎమ్మెల్యేలు ప్రసంగిస్తూ వస్తున్నారు. అయితే ఎంపీ మాలోత్ కవిత ( MP Malot Kavita ) ప్రసంగిస్తున్న సమయంలో శంకర్ నాయక్ దురుసుగా వచ్చి మైక్ ఇవ్వాలని అడిగారు. తాను మాట్లాడుతున్నాను కదా అని ఆమె ప్రశ్నించారు. అయినప్పటికీ తాను ముందుగా మాట్లాడాలంటూ మైక్ లాక్కుని స్టేజ్ మీదకు వెళ్లారు . ఈ హఠాత్ పరిణామంతో కవిత బిత్తరపోయారు. కింద కూర్చుని కళ్లు తుడుచుకున్నారు.
మోదీ ప్రభుత్వంలో సిలిండర్ వెయ్యి అయింది - కట్టెల పొయ్యి దిక్కైంది : మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీలో ( TRS ) ఇద్దరి మధ్య ఆధిపత్యపోరాటం ఉండటం వల్లనే ఇలా జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇద్దరూ మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందినవారే. ఒకరు ఎమ్మెల్యేగా..మరొకరు ఎంపీగా ఉన్నారు. శంకర్ నాయక్ వివాదాస్పద ప్రవర్తన ఇదే మొదటి సారి కాదు. గతంలోఓ మహిళా కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల హోలీ పండుగ రోజు.. మద్యం దుకాణాలు మూసేసినప్పటికీ తన అనుచరుకు స్వయంగా నోట్లో మద్యం పోస్తూ హల్ చల్ చేశారు. తాజాగా ఎంపీ కవితతో అనుచితంగా ప్రవర్తించి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
తెలంగాణలో రూ. వెయ్యి కోట్ల కోకాకోలా పెట్టుబడి - రెండో ప్లాంట్‌కు ఒప్పందం !