తెలంగాణ గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ ( Governer Tamilsai ) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ( Amitshah ) సమావేశమయ్యారు. బుధవారం ప్రధానమంత్రితో భేటీ అయిన ఆమె.. గురువారం హోంమంత్రితో భేటీ అయ్యారు.  ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తున్న తీరును అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తమిళిశై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్‌షాతో జరిగిన చర్చల వివరాలను బయటకు చెప్పలేనన్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిశై ఉన్నారు. తాను అమిత్ షాతో భేటీలో తెలంగాణ, పుదుచ్చేరిలకు సంబంధించిన అంశాలపై మాట్లాడానన్నారు. 

విద్యుత్ సౌధ ముట్టడించిన కాంగ్రెస్ నేతలు- సుమారు రెండు గంటలపాటు హైడ్రామా

కొన్ని అంశాలను బుధవారమే మీడియాకు చెప్పానని ...తాను ఏం మాట్లాడినా తెలంగాణ ( Telangana ) ప్రజల కోసమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని తాను చెప్పలేదని ఎమ్మెల్యే సీతక్క చెప్పారన్నారు. మేడారానికి తాను రోడ్డు మార్గం ద్వారా వెళ్లానని  భద్రాచలానికి కూడా అంతే వెళ్తానన్నారు. తన పర్యటనల్లో రోడ్డు, రైలు మార్గం ద్వారా మాత్రమే వె్ళ్లగలనన్నారు. గవర్నర్ ( Governer ) పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసని మీడియాను ఉద్దేశించి తమిళిశై వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్‌కు ఎక్కడా మర్యాద ఇవ్వడం లేదన్నారు. రిపబ్లిక్ డే, రాజ్ భవన్ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ రాలేదన్నారు. ఏమైనా ఉంటే తనతో చర్చించవచ్చని తమిళిశై స్పష్టం చేశారు. 

ఈడీ అడిగినా డ్రగ్స్ కేసు సాక్ష్యాలివ్వరా ? తెలంగాణ సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరక్టర్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు !

తమిళిశై రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం తీరుపైనా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించినట్లుాగ తెలుస్తోంది. అటు ప్రధానిని.. అటు అమిత్ షాను కలిసిన కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రోటోకాల్ ( Protocal ) ఇవ్వడం లేదని.. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారని నేరుగానే చెబుతున్నారు. ఆమె బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని  టీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే ఎదురుదాడి తిగారు. ఇప్పటి వరకూ రాజ్ భవన్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం ఘర్షణ  మీడియాలో పెద్దగా హైలెట్ కాలేదు. కానీ గవర్నర్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిస్థితులు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.