కాంగ్రెస్ చేపట్టిన విద్యుత్ సౌధ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హౌస్‌ అరెస్టును ఛేదించుకొని విద్యుత్‌ సౌధ వద్దకు చేరుకున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు చాలా మంది అక్కడుకు చేరుకున్నారు. భారీగా శ్రేణులు కూడా వారితో ఉన్నారు. 


విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నాతో ఆప్రాంతంలో భారీగా ట్రాపిక్ జామ్ అయింది. పోలీసులు ముందస్తుగానే మోహరించి విద్యుత్‌ సౌధ లోపలికి ఎవర్నీ రానీయకుండా జాగ్రత్త పడ్డారు. గేట్లు వేసేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపైనే కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గేట్లు తీయాలని.. వినతి పత్రం ఇచ్చి వెళ్తామని ఎంత చెప్పినా అధికారులు గేట్లు తీయలేదు. 











పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు కొందరి నేతలనే లోపలికి అనుమతించారు. పది మందిని విద్యుత్‌ సౌధరలోకి వెళ్లనిచ్చారు. అలా విద్యుత్ సౌధ లోపలికి వెళ్లిన వారిలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క శ్రీధర్‌బాబు, మధుయాష్కీ ఉన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ అధికారులతో కాంగ్రెస్‌ నేతలు  డిమాండ్ చేశారు.