ఢిల్లీలో ఉన్న టీఆర్ఎస్ నేతల బృందం కేంద్రంపై విమర్శలు గుప్పించింది.  వ‌రిధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ మాటిచ్చార‌ని.. అందుకోసమే లేఖ కోసం వేచి చూస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మెున్న మాటిచ్చి.. ఇప్పటి వరకు మళ్లీ స్పందించలేదని.. వారి నిర్ణయం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామన్నారు. అంతేగాని.. ప్రేమ‌లేఖ‌లు ఇచ్చేందుకో.. ప్రేమించేందుకో.. ఢిల్లీకి రాలేదని అన్నారు. లక్షల మంది జీవితాలు.. ఇందులో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అన్నదాతల సమస్యలపై.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎందుకు లేదని ప్రశ్నించారు.


తెలంగాణ మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, గంగుల క‌మలాక‌ర్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి నిరంజ‌న్ రెడ్డి.. తెలంగాణ చేసిన త‌ప్పేంటి అని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాలే తెలంగాణ‌లోని వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు నిద‌ర్శ‌నం అన్నారు.


వినూత్న విధానాలు, సహసోపేత నిర్ణయాలతోనే చరిత్రలో నిలిచిపోతామని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి నిర్ణయాలు..  తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమే చాలాసార్లు ప్రశంసించిందన్నారు. ఇప్పుడు కేంద్రమే రాజకీయ పార్టీగా వ్యవహరించటం సరికాదని వ్యాఖ్యానించారు. యాసంగి ధాన్యం తీసుకోమన్నందుకు ఒప్పుకుని.. రైతులకు కూడా వరి వేయొద్దని చెప్పామన్నారు. వానాకాలంలో పండిన ధాన్యం విషయంపై.. నోటితో చెప్పిన మాటను రాతపూర్వకంగా అడుగుతున్నామని చెప్పారు. 


కేంద్రంలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయని.. వాళ్ల విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం ఏమైనా చేస్తుందని.. అన్నం పెట్టే అన్నదాతలను మాత్రం మరిచిపోతుందన్నారు. సుమారు 20 ఉత్పత్తులకే కేంద్రం నామమాత్రపు ఎంఎస్‌పీ ఇస్తోందని.. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మోడీ చెప్పారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.


Also Read: Crime News: బాచుపల్లిలో ఓ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి.. యాజమాన్యంపై బంధువుల ఆరోపణలు


Also Read: Omicron Restrictions: దేశంలో ఒమిక్రాన్ ప్రకంపనలు... మళ్లీ రాష్ట్రాల్లో మొదలైన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు... మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం


Also Read:  సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్


Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి