Minister KTR UK Tour : తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పలు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఇందులో భాగంగా యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో కూడా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ కంపెనీల బృందాలకు తెలంగాణలో అవకాశాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం అమలు చేస్తున్న పాలసీలు, తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను ఆ కంపెనీ ప్రతినిధులకు తెలియచేశారు. 



అత్యంత అనువైన నగరం హైదరాబాద్ 


రాష్ట్రంలో వినూత్నమైన పారిశ్రామిక పాలసీలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పాటు నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమ మౌలిక వసతులు, పాలసీలు ప్రోత్సాహకాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యంగా దేశంలోని ఇతర నగరాల్లో లేని కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్ లో మాత్రమే ఉందని కేటీఆర్ ఉన్నారు.  తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను ఆహ్వానించారు. భారత్ లో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ అనేకసార్లు అవార్డులు అందుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు కేంద్రంగా మారిందన్నారు. 


టాప్ కంపెనీలతో వరుస భేటీలు 


భారత్, యూకే మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలున్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఈ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. డెలాయిట్, హెచ్ఎస్బీసీ, జేసీబీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. 



బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధనతో మంత్రి కేటీఆర్ భేటీ 


బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధనతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. లండన్ లోని మంత్రి జయవర్ధన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యతలు, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన TS-iPass విధానం గురించి తెలుసుకున్న బ్రిటన్ మంత్రి, ఈ