తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ఏ ప్రాంతంపై వివక్ష లేదని మంత్రి కేటీఆర్ శాసనసభలో తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీకి ఏడేళ్లలో రూ.14,897 కోట్లు ఖర్చు చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాలు రూ.3,934 కోట్లే ఖర్చు చేసిందని గుర్తుచేశారు. పాతబస్తీలో పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి జరుగుతోందన్న ఆయన.. అక్కడ కచ్చితంగా మెట్రో రైలు వస్తుందన్నారు. కరోనా పరిస్థితుల వల్ల పాతబస్తీకి మెట్రో రైలు కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనుల కోసం నిధులు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టుకు మరో రూ. 100 కోట్లు కేటాయిస్తామని శాసనసభలో మంత్రి సమాధానం ఇచ్చారు. సెవెన్ టోంబ్స్, గోల్కొండ కోటను ప్రపంచ వారసత్వ హోదా తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. మీర్‌ఆలం చెరువును దుర్గం చెరువులా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. సచివాలయంలో మసీదు, గుడి, చర్చి నిర్మాణాలు చేపడతామన్నారు.
Also Read: రిపబ్లిక్ సినిమా చూసిన రేవంత్ రెడ్డి, సీతక్క.. వారి స్పందన ఏంటంటే..
అభివృద్ధిలో కొత్త, పాత నగరాలని తేడా లేదు
తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏ వివక్ష లేకుండా అమలు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. ములుగును జిల్లా కేంద్రంగా చేస్తానని 2018 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అనంతరం ఆ హామీ నెరవేర్చామని తెలిపారు. తర్వాత ములుగును జిల్లాగా ప్రకటించామని తెలిపారు. ఏ వివక్ష లేకుండా అభివృద్ధిని చేస్తున్నామని స్పష్టంచేశారు. స్వాతంత్య్రం వచ్చాక పాతబస్తీలో ఏ ప్రభుత్వం చేపట్టని స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేపట్టిందన్నారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టుకు మరో వంద కోట్లైనా ఇచ్చేందుకు సిద్ధంమన్నారు. అభివృద్ధిలో పాత, కొత్త నగరాలని తేడా లేదన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనుల కోసం నిధులిస్తామని అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటించారు. సచివాలయంలో మసీదు, గుడి, చర్చిలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: పద్మశ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా? వద్దా? కేంద్రంతో గలాటనే.. అసెంబ్లీలో కేసీఆర్
తిన్నది అరక్క పాదయాత్రలు
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేత బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ తిన్నది అరక్క పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. మతం ముసుగులో తెలంగాణను నాశనం చేసే ప్రతయ్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియోతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే పాలించిందన్నారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఫ్లోరైడ్‌తో నల్గొండ అతలాకుతలం అయితే కాంగ్రెస్ ఏంచేసిందన్నారు. తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్ జంగ్ లేదు బొంగు లేదు జంగ్ సైరన్ లేదని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌కి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని కేటీఆర్ స్పష్టంచేశారు.
Also Read: రాంగ్ రూట్‌లో కేటీఆర్ కారు.. ఆపేసిన ట్రాఫిక్ పోలీస్.. చివరికి ఏమైందంటే..
ఆ పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష
టీపీసీసీ, తెలంగాణ బీజేపీ కేసీఆర్ పెట్టిన భిక్ష అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి నీరు ఇచ్చే పథకాన్ని కేంద్రం మెచ్చుకుందని కేటీఆర్ తెలిపారు. ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న కేటీఆర్... సీఎం కేసీఆర్ దళిత బంధుని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!