కొవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ వ్యాక్సిన్‌లు ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అందుకోసం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు కుదించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించాలని హరీశ్ రావు కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలని సూచించారు.
18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోసు విధానాలు, వాటి ద్వారా వస్తున్న ఫలితాల ఆధారంగా తాను ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా హరీశ్ రావు లేఖలో వివరించారు.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి విపరీతంగా ఉంటోంది. నిన్న ఒక్కరోజే 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112, రంగారెడ్డి జిల్లాలో 183, మేడ్చెల్ జిల్లాలో 235 కరోనా కేసులు నమోదు అయ్యాయి. జంట నగరాల పరిధిలోనే సగానికి పైగా కరోనా కేసులు ఉన్నాయి. ప్రజలతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.
గాంధీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 119 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో పీజీలు 40, ఫ్యాకల్టీ 6 ,హౌస్ సర్జన్ 38, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 35 మంది ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రిలలో మొత్తంగా 159 మంది వైద్య సిబ్బంది కరోనా ఎఫెక్ట్ పండింది. ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 60 మందికి కరోనా సోకగా... అందులో 10మందికి పైగా డాక్టర్స్ ఉన్నారు. మరోవైపు హాస్పిటల్‌లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్‌లో 2200 మంది రోగులు ఉన్నారు. టిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 69 మంది కరోనా పేషేంట్స్‌లు చికిత్స పొందారు. గాంధీ ఆస్పత్రిలో 153 మంది కరోనా పేషెంట్స్‌కు చికిత్స అందింది.
Also Read: Peddapalli: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి