ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని.. మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు మార్చి 31వ తేదీలోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నట్టు వెల్లడించారు. దళితబంధు పథకం మీద సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్‌ ఖాతాలో నిధులు జమ అయ్యాయన్నారు. 


లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయాలకు లేవని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎంతో మంది దళితబంధుపై విమర్శలు గుప్పించారని.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీని.. నిలబెట్టుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే.. దళిత బంధు అమలు చేస్తుందన్నారు. విమర్శలు చేసేవారు ఇప్పటివరకైనా మానుకోవాలని హితవు పలికారు. రాబోయే బడ్జెట్‌లోనూ దళితబంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు.


నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అయితే నియోజకవర్గంలోని ఏ ఊరును ఎంపిక చేసి... పంపాలన్నది.. ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. జిల్లా మంత్రి అధ్యక్షతన ఎమ్మెల్యేలు.. నియోజకవర్గంలోని ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఎంపిక చేశాక.. ఆ సమాచారాన్ని జిల్లా అధికారులకు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత అధికారులు.. గ్రామాల్లో పర్యటించి.. లబ్ధిదారులను ఎంపిక చేస్తారని మంత్రి వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ, బ్యాంకు అకౌంట్లు తెరవడం ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని చెప్పారు. త్వరగా ఈ పని పూర్తయితే.. మార్చి మొదటి వారం కల్లా యూనిట్లను గ్రౌండ్‌ చేయాలన్నారు.  దీనికోసం రెండు నెలల గడువే ఉన్న కారణంగా.. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.


Also Read: Minister Harish Rao: కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు... రాష్ట్రంలో 56 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.. మంత్రి హరీశ్ రావు


Also Read: Warangal: నాకు కోపం వస్తే అడ్రస్ లేకుండా పోతారు... కొండా దంపతులపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు...


Also Read: Karimnagar: హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు కానిస్టేబుల్ పై దాడి... పోలీసుల రంగ ప్రవేశంలో సద్దుమణిగిన గొడవ...!


Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు.. అక్కడ భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు