ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని రిటర్నింగ్ అధికారికి తెలంగామ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సర్వీసులో ఆయనపై ఆనేక ఆరోపణులు ఉన్నాయని...వాటిపై విచారణ జరుగుతున్నందున ఆయన నామినేషన్ ఆమోదించవద్దని .. తిరస్కరించాలని కోరారు. గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారని టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉంటూ ప్రమోషన్లు పొందారని... భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపిస్తున్నారు. 


Also Read : కొత్త ఎమ్మెల్సీల్లో ముగ్గురికి మంత్రి పదవులు ! "ఎలక్షన్ కేబినెట్ " కోసమే కేసీఆర్ కసరత్తులా ?


హైదరాబాద్ శివారులో ఇటీవల ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల విషయంలోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయని రేవంత్ చెబుతున్నారు. ఆయన కుటుంబానికి చెందిన రాజ్‌ పుష్ప సంస్థకు భూములు దక్కించుకున్నట్లు ఆరోపించారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న 24 గంటల్లోపే వెంకట్రామిరెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారని.. నామినేషన్‌ పత్రాల పరిశీలన సమయంలో కాంగ్రెస్‌ను ఎందుకు అనుమతించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 


Also Read : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో హీట్. రాజ్యసభకు కవిత? ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ


అధికార వ్యవస్థకే అవమానం తెచ్చేలా వెంకట్రామిరెడ్డి వ్యవహరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారని విమర్శించారు. కలెక్టర్ హోదాలో ఉండి కేసీఆర్ కాళ్లు మొక్కారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో ఉంచకపోవడాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ఎన్నిక జరిగినా నామినేషన్లు వేసిన వారి వివరాలు, అఫిడవిట్లు ఆన్‌లైన్‌లో పెడతారని.. కానీ ఎందుకు పెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


Also Read : గురువారం ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా .. వరి కొనుగోలుపై కేంద్రం తేల్చాల్సిందేనన్న కేసీఆర్ ! 


ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని ఎన్నికల ప్రక్రియ అంతా టీఆర్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ అభ్యంతరాలపై ఎన్నికల అధికారులు స్పందించట్లేదు. రాష్ట్ర ఎన్నికల అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ గడువు ముగియడంతో టీఆర్ఎస్ తరపున నామినేషన్లు వేసిన ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించడం లాంఛనమే.


Also Read : గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి