Breaking News Live: రేపు బోధన్ బంద్ కు బీజేపీ పిలుపు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 20 Mar 2022 08:53 PM
రేపు బోధన్ బంద్ కు బీజేపీ పిలుపు

రేపు బోధన్ పట్టణంలో బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఇవాళ బోధన్ లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, శివసేన, మైనార్టీ నాయకుల మధ్య దాడులు జరిగాయి. దీంతో బోధన్ లో 144 సెక్షన్ విధించారు. 

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ధర్నా 

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ధర్నాకు దిగారు. ఇడుపులపాయ క్యాంపస్ లోని అకాడమిక్ బ్లాక్ 1 వద్ద P1, P2 విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. P1, P2, విద్యార్థులను ఇడుపులపాయలోని ఓల్డో క్యాంపస్ లోకి వెళ్లమని చెప్పడంతో వివాదం చెలరేగింది.  ఓల్డో క్యాంపస్ లో సరైన మౌలిక వసతులు కల్పించే వరకు వెళ్లమని నిరసనకు దిగారు. విద్యార్థుల అరుపులతో క్యాంపస్ అంతా మారు మోగుతుంది. విద్యార్థులను ఆందోళన విరమింపజేసేందుకు డైరెక్టర్ సంధ్యారాణి బెదిరింపులకు దిగారు. ఆందోళన విరమించకపోతో పోలీసులతో విద్యార్థులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. 

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న పండిట్ రవిశంకర్

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు.. ఆలయ వద్దకు చేరుకున్న ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ గురూజీకి విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు, డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు..‌ దర్శనానంతరం ఆశీర్వాదం అందించారు. మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

నకిలీ మద్యం బ్రాండ్లు నిషేధించాలని అనపర్తిలో టీడీపీ నేతల నిరసన

ఏపీలో నకిలీ మద్యం, కల్తీ సారా, జే బ్రాండ్ ట్యాక్స్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేతలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ర్యాలీ చేశారు. తాళిబొట్లు తెంచే కల్తీ సారా  అంటూ బ్రాందీ షాపు వద్ద నినాదాలు చేశారు. టీడీపీ ఇంచార్జి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నాయి. తాడేపల్లి మద్యాన్ని నిషేధించాలని జగన్ బ్రాండ్లలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Nizamabad News: బోధన్‌లో ఉద్రిక్తత, శివాజీ విగ్రహం ఏర్పాటుతో ఘర్షణ

Nizamabad జిల్లా బోధన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికంగా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం ఈ వివాదానికి మూలం అయింది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో మైనార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి ఇరువర్గాల నాయకులు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ నెలకొనడంతో పోలీసుల జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మెడికల్ కాలేజీకి మల్లు స్వరాజ్యం భౌతిక కాయం

మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్గొండకు తరలించనున్నారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో ఆమెకు సంతాప సభ నిర్వహిస్తారు. పార్టీ శ్రేణుల నివాళుల తర్వాత భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి  అప్పగిస్తారు. స్వరాజ్యం చివరి కోరిక మేరకు వైద్య కళాశాలకు ఇవ్వనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Mallu Swarajyam: మల్లు స్వరాజ్యంకు ప్రముఖుల నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం మాకినేని బసవపున్నయ్య భవన్‌​లో ఆమె భౌతికకాయానికి ప్రముఖ రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఎంబీ భవన్​లో మంత్రి ఎర్రబెల్లి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి తదితరులు ఆమె పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.





Mallu Swarajyam: మల్లు స్వరాజ్యంకు ప్రముఖుల నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్పూర్తి అని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం మాకినేని బసవపున్నయ్య భవన్‌​లో ఆమె భౌతికకాయానికి ప్రముఖ రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఎంబీ భవన్​లో మంత్రి ఎర్రబెల్లి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి తదితరులు ఆమె పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.





Shoban Babu Death Anniversary: ఘనంగా నటుడు శోభ‌న్ బాబు 14వ వ‌ర్దంతి

Shoban Babu Death Anniversary: సినీ న‌టుడు, నట భూషణ్ శోభన్ బాబు 14 వ వర్ధంతి ఘ‌నంగా నిర్వహించారు. రాష్ట్రంలోని శోభ‌న్ సిండికేట్ ఆధ్వర్యంలో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. శోభ‌న్ బాబు తెలుగు సిని చ‌రిత్ర‌లో చిరస్థాయిగా నిలిచిపోతార‌ని అభిమానులు కొనియాడారు. గాంధీ నగర్‌లోని శోభన్ బాబు విగ్రహం వ‌ద్ద స్టేడ్ వైడ్ శోభ‌న్ బాబు సిండికేట్ ఆయన పేరు మీద జెండాను ఆవిష్కరించింది. అనంత‌రం ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళ‌ర్పించారు.స్టేట్ వైడ్ శోభన్ బాబు సిండికేట్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  కళ్ళేపల్లి మధుసూదన రాజు, ధార సత్యనారయణ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పేద‌ల‌కు పండ్లు, అల్పాహారాన్ని పంపిణి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా సామాజిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తామ‌ని అన్నారు.

KTR America Tour: మంత్రి కేటీఆర్‌కి అమెరికాలో ఘనస్వాగతం

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే. తారకరామారావుకి ఈరోజు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్ పోర్టులో మంత్రి కేటీఆర్ కి పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు. 


మంత్రి కే తారకరామారావు లాస్ ఏంజిల్స్ లో తనకు  స్వాగతం పలికిన  ఎన్నారైలతో తర్వాత కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.

Japan PM Fumio Kishida: భారత్‌లో ముగిసిన జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా పర్యటన

Japan PM Fumio Kishida: జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా రెండు రోజుల భారత పర్యటన ముగిసింది


భారత్‌లో వచ్చే ఐదేళ్లలో  రూ.3.2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న జపాన్


14వ భారత్, జపాన్ ద్వైపాక్షిక భేటీలో పలు కీలక నిర్ణయాలు


ఢిల్లీ నుంచి విమానంలో తిరుగు ప్రయాణమైన కిషిడా


తన భారత పర్యటన ముగిసిన తర్వాత కిషిడా కంబోడియాలో పర్యటించనున్నారు.

Kishan Reddy: తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యటక శాఖామంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ముందుగా ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న కిషన్ రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి కానుందన్నారు.. ఆజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు.. జూన్ 21వ తేదీ భారీ ఎత్తున్న యోగ కార్యక్రమం నిర్వహిస్తామన్న ఆయన.. ఆర్కియాలజీ ఆధ్వర్యంలో 75 పురాతన ఆలయాలను పునరుద్ధణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. అద్భుతమైన కట్టడాలు ఉన్న 75 పర్యాటక కేంద్రాల అభివృద్ధికి, వసతి కల్పనకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

మల్లు స్వరాజ్యానికి రేవంత్ రెడ్డి నివాళులు

* కేర్ ఆసుపత్రిలో మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
* కమ్యూనిస్టు యోధురాలికి లాల్ సలాం అంటూ నివాళులు.. 
* మల్లు స్వరాజ్యం ఆశయాలు సాధిస్తామని నినాదాలు 
* మల్లు స్వరాజ్యం పోరాటాలు రాజకీయ చరిత్రను రేవంత్ రెడ్డి కి వివరించిన సీపీఎం నేతలు 
* మల్లు స్వరాజ్యంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమెతో ఉన్న ఫోటోలతో ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

Background

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది.  తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కేంద్రంగా ఉందని భారత వాతావరణ కేంద్రం, అమరావతి కేంద్రం తెలిపాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ శనివారం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో నేడు (ఆదివారం) వాయుగుండంగా మారనుంది. 


వాయుగుండం సోమవారం (మార్చి 21న) తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ వాతావరణం (Temperature in Andhra Pradesh), తెలంగాణలోనూ పొడిగా మారింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీ, యానాంలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.  


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వస్తాయి. మరో 24 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు వారాలుగా పెరుగుతున్న ఎండల నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని, గాలులు తీవ్రమైతే వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. గత మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. . 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. అల్పపీడన ప్రభావం ఈ ప్రాంతాల్లో చాలా తక్కువ. రాయలసీమలో చలి గాలులు వేగంగా వేచనున్నాయి. మరో 24 గంటల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. బాపట్లలో 33 డిగ్రీలు, కావలిలో 35.3 డిగ్రీలు, మచిలీపట్నంలో 34.3 డిగ్రీలు, ఒంగోలులో 34.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి.


తెలంగాణ వెదర్ అప్‌డేట్
అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలంగాణలో కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి.  గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) కురిసింది. సైదాబాద్, సంతోష్ నగర్ చంపా పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మలక్ పేటలలో భారీ వర్షం పడటంతో హైదరాబాద్ ఉష్ణోగ్రత కాస్త తగ్గడంతో నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మిర్యాలగూడలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాడిపోవడంతో వాతావరణంలో ఉక్కపోత ఎక్కువైంది. ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39 డిగ్రీలు, ఖమ్మంలో 36, నల్గొండలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా మూడో రోజు నేడు (Todays Gold Rate) తగ్గింది. గ్రాముకు నేడు రూ.15 తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.600 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,600 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,300 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,300 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.