Liquor Price In Telangana: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందా అంటే అవుననే పరిస్థితి కనిపిస్తోంది. త్వరలోనే మద్యం ధరలను తెలంగాణ సర్కార్ తగ్గించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కొవిడ్19 వ్యాప్తి సమయంలో రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మద్యం రేట్లను 20 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలతో లిక్కర్ విక్రయాలు తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. మద్యం విక్రయాలు తగ్గడానికి పెంచిన ధరలే కారణమని భావిస్తున్న ఎక్సైజ్ శాఖ అందుకు తగిన చర్యలు చేపట్టింది.
ధరల తగ్గింపు కోసం శాఖ ప్రతిపాదనలు
కరోనా వ్యాప్తి (Corona Virus In Telangana) తగ్గినా మద్యం అమ్మకాలు తగ్గడంతో అబ్కారీ శాఖ దీనిపై ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే మద్యం రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. లిక్కర్ అమ్మకాలు మళ్లీ పెరిగేలా చేసేందుకు ఒక్కో బాటిల్‌పై రూ.10 తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల తగ్గింపుపై ఆ శాఖ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుందని మందు బాబులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ బీర్లు మినహా ఇండియాలో తయారయ్యే మద్యంపై స్వల్పంగా ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గ
తెలంగాణ వ్యాప్తంగా 2620 వైన్స్ షాపులతో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక రెస్టారెంట్స్ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి మద్యం డిపోల నుంచి సరుకు తక్కువగా రవాణా అవుతోంది. అయితే న్యూ ఇయర్ తరువాత విక్రయాలు తగ్గడమే అందుకు కారణమని ఎక్సైజ్ శాఖ భావించి, ధరల తగ్గింపు కోసం ప్రతిపాదనలు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 20 శాతం వరకు లిక్కర్ రేటు పెంచింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7న ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో ఈసారి ఈ విషయంపై అంతగా ఫోకస్ చేయడం లేదు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై అధికార టీఆర్ఎస్ కు, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలకు మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. మేడారం జాతర సమయంలోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రొటోకాల్ పాటించకుండా తెలంగాణ ప్రభుత్వం అవమానించిందని విమర్శిస్తున్నాయి విపక్షాలు. తాజాగా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో మరోసారి పాత వివాదాలు తెరపైకి వస్తున్నాయి.
Also Read: Governor Tamilisai: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళి సై ఆగ్రహం
Also Read: Priyanka Narula: చింతకాయతో వరల్డ్ ఫేమస్, హైదరాబాద్ మహిళ వండర్‌ఫుల్ విక్కర్ స్టోరీ