KTR To Delhi :     భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత శనివారం ఉదయం ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశంం ఉంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే రామచంద్ర పిళ్లై ఉన్నారు. ఆయన స్వయంగా తాను కవిత బినామీనని వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్నివెనక్కి తీసుకుంటానని ఆయన  హౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తో సంబంధం లేకుండా ఈడీ కస్టడీలో ప్రశ్నించి అదనపు వివరాలు రాబడుతోంది. స్వయంగా కవితకు బినామీనని ఒప్పుకున్నందున ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 


న్యాయనిపుణులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్                              


తెలంగాణ మంత్రి కేటీఆర్ .. కవిత ఈడీ విచారణ సందర్భంగా ఢిల్లీకి వెళ్తున్నారు. అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతూండటంతో  న్యాయనిపుణులతో సంప్రదింపులు చేసే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న కేటీఆర్ వెంట ... భారత రాష్ట్ర సమితి న్యాయవిభాగానికి చెందిన పలువురు నిపుణులు కూడా ఢిల్లీ వెళ్లారు. కీలక నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలోనూ కేసీఆర్ కవితకు ఈడీ నోటీసులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.  


బీజేపీ చేరని వారిని కేసులతో వేధిస్తున్న కేంద్రం                    


బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని కవితను కూడా చేరమన్నారని మహా అయితే ఏం చే స్తారు జైలుకు పంపుతారు అంతే కదా అని కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.  కవితను అరెస్ట్‌ చేయొచ్చునని... చేసుకుంటే చేసుకోని అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు  చెబుతున్నాయి.  కేంద్రంలో దుర్మార్గమైన ప్రభఉత్వం ఉందని.. కేసులతో    అందర్నీ వేధిస్తున్నారని... భయపడేది లేదు.. పోరాటం వదిలేది లేదు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.  గంగుల, రవిచంద్ర.. ఇప్పుడు కవిత వరకు వచ్చారు.. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తారు.. ప్రజల కోసం కడుపు కట్టుకుని పనిచేయాలని సూచించారు.  


శనివారం ఢిల్లీలో కీలక  పరిణామాలు


మహిళలను ఇంటి వద్దే విచారించాలన్న నియమాలు ఉన్నా  ఈడీ తనను ఆఫీసుకే రమ్మని ఆదేశించిందని కవిత ఇప్పటికే ఆరోపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా నిందితుల్ని తన ఇంటికే తీసుకు వచ్చి  ప్రశ్నించవచ్చని చెప్పానన్నారు. వేటికీ ఈడీ అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో ఈడీ ఈఫీసుకు తప్పని సరిగా వెళ్లాల్సిన పరిస్థితి కవితకు ఏర్పడింది. ఇప్పటికే ఢిల్లీలో కవిత నిర్వహించిన మహిళా రిజర్వేషన్ల ధర్నా కోసం పార్టీ నేతుల పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు మరికొంత మంది నేతలు కేటీఆర్ తో వెళ్తున్నారు. శనివారం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.