KTR :  తెలంగాణ మంత్రికేటీఆర్ మరో అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనున్నారు. అక్టోబర్ 4వ తేదీన స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్ లో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి రావాలంటూ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం  అందింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన, శక్తిమంతమైన ఆసియా, యూరప్ నాయకుల సమావేశంలో పాల్గొనాలంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ వేదికగా జరగనున్న ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్‌ నిర్వాహకుల నుంచి కేటీఆర్‌కు ఇన్విటేషన్ వచ్చింది. ఈ సమావేశంలో యూరప్, ఆసియాలకు చెందిన 100 మంది అత్యంత ప్రభావశీలమైన నాయకులు పాల్గొంటారు.


రాజకీయ అనిశ్చితుల వల్ల దెబ్బతింటున్న కంపెనీల వ్యాపార అవకాశాలపై చర్చ


ఆసియా-యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. “మీలాంటి గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చను నిర్వహించడం మా లక్ష్యం”అని మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ ఆహ్వానలేఖలో పేర్కొన్నారు.


కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !


మీట్‌లో పాల్గొననున్న పలువురు అంతర్జాతీయ ప్రముఖులు


అక్టోబర్ 4న జరిగే ఈ సమావేశంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎంఐ6 మాజీ చీఫ్ సర్ జాన్ స్కార్లెట్, ఎల్డీసీ గ్రూప్ చైర్మన్ మార్గరిటా లూయిస్ డ్రూఫస్, గోల్డ్‌మాన్ శాచ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ మాజీ చైర్మన్ లార్డ్ జిమ్ ఓనీల్, విడాకైక్సా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ జోర్డి గాల్, బ్యాంక్ ఆఫ్ చైనా యూకే బోర్డ్ మెంబర్ డాక్టర్ గెరార్డ్ లియాన్స్, హెచ్‌ఎస్‌బీసీ మాజీ సీఈవో, చైర్మన్ లార్డ్ స్టీఫెన్ గ్రీన్ వంటి మహామహులు పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ అసందిగ్ధత, యూరప్-ఆసియా కారిడార్‌లో సేవలందిస్తున్న బడా కంపెనీలపై దీని ప్రభావంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. 


దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !


ఆసియా లీడర్స్‌ మీట్‌కు ఆహ్వానం పట్ల కేటీఆర్ సంతోషం
 
ఆసియా లీడర్స్ సిరీస్ నుంచి ఆహ్వానం అందడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందన్నారు.  ఇలాంటి సమావేశాలకు హాజరవడం వల్ల తెలంగాణ గురించి అంతర్జాతీయ వేదికపై గొప్పగా ప్రజెంట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. గతంలోనూ పలు అంతర్జాతీయ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రమోట్ చేశారు. ఇండియా  నుంచి కేటీఆర్‌కే ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. 



ఇన్ని వర్షాలు పడినా సీమకు నీళ్లేవి ? - ప్రాజెక్టులపై చేసిన ఖర్చెంతో చెప్పాలన్న ఏపీ బీజేపీ !