Rohingya Refugee: 


మంత్రి అలా, హోం మంత్రిత్వ శాఖ ఇలా..! 


దిల్లీలోని బక్కర్‌వల ప్రాంతంలో రోహింగ్యాల కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌లు కడతామని, వారికి రక్షణ కూడా కల్పిస్తామని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ప్రకటించిన కాసేపటికే...కేంద్రం ఈ ప్రకటనను ఖండించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. "అక్రమంగా దేశంలోకి వచ్చిన వాళ్లను డిటెన్షన్ సెంటర్స్‌లోనే ఉంచుతాం. వారు మన దేశం వదిలి వెళ్లేంత వరకూ ఆ కేంద్రాల్లోనే ఉంటారు" అని వెల్లడించింది. అంతే కాదు. ప్రస్తుతం బక్కర్‌వల ప్రాంతంలో ఉన్న శరణార్థుల్ని వేరే ప్రాంతానికి తరలించాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ప్రాంతాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించకూడదని తేల్చి చెప్పింది. టెంట్‌లలో నివసిస్తున్న 1100 మంది రోహింగ్యా శరణార్థులను అపార్ట్‌మెంట్లలోకి తరలిస్తామని, వారికి రౌండ్ ది క్లాక్ భద్రత కూడా కల్పిస్తామని హర్‌దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. కానీ హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ఇందుకు భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది.