BJP Vs KTR :  దేశంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ పక్షాలపై కక్ష తీర్చుకోడానికి ...   అవినీతి పరులైన నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని విపక్షాలు చాలా కాలంగా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌.. ‘ఈక్వాలిటీ బిఫోర్‌ లా..?’ అనే శీర్షికతో  కొంత మంది జాబితాను   ట్వీట్‌ చేశారు. వారంతా బీజేపీలో చేరక ముందు తీవ్ర కేసులు ఎదుర్కొన్న వారు. బీజేపీలో చేరిన తర్వాత వారిపై విచారణలు ఆగిపోయాయి. 


 





 


మహారాష్ట్రలో నారాయణ్‌ రాణే, పశ్చిమబెంగాల్‌లో సువేంధు అధికారి, అసోంలో హిమాంత బిశ్వశర్మ తదితర నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి మోదీ సర్కారు ఎలా దారికి తెచ్చుకున్నదో అందులో వివరించారు.దానికి ‘హౌ ద మోదీ గవర్నమెంట్‌ మిస్‌ యూజెస్‌ ద ఏజెన్సీస్‌ టు టాపిల్‌ గౌట్స్‌, ఇండ్యూస్‌ డిఫెక్షన్స్‌ అండ్‌ హరాస్‌ అప్పొజిషన్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ ట్విట్ లో నారాయ‌ణ్ రాణే 300 కోట్ల మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇరుకుంటే ఆయ‌న బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.. వెంట‌నే దానిపై విచార‌ణ నిలిచిపోయింది.. నార‌ద స్కామ్ లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్ నేత సువేంధు అధికారి క‌మలంలో చేరిన వెంట‌నే ఆ కేసు ఎటో వెళ్లిపోయిందన్నారు.                                    


లంచం కేసులో చిక్కుకున్న అసోం నేత హిమాంత భిశ్వ‌శ‌ర్మ బెజెపి గూటికి చేర‌డంతో ఆ కేసు అట‌కెక్కింది. మ‌హ‌రాష్ట్ర శివ‌సేన లీడ‌ర్, ఎంపి గౌలి అవినీతి కేసులో అయిదుసార్లు స‌మ‌న్లు వ‌చ్చిన సంద‌ర్భంలో ఆయ‌న షిండే శిబిరంలో చేరిపోయారు.. ఆ కేసు గురించి ఆలోచించ‌డ‌మే మానివేశారు.. య‌శ్వంత్ జాద‌వ్ దంప‌తులు కషాయం క‌ప్పుకోవ‌డ‌తో వారి కేసులు మాఫీ అయిపోయాయి.. అంటూ ప్ర‌శాంత్ భూష‌ణ్ పేర్కొన్నారు. ఆ ట్విట్ ను కెటిఆర్ రీ ట్విట్ చేశారు.             


కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణపైనా గురి పెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో .. కేటీఆర్.. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటున్నారో వివరించేలా ఉన్న  ఈ ట్వీట్‌ను.. తన ఖాతాలోకి షేర్ చేసుకోవడంతో.. బీఆర్ఎస్ క్యాడర్.. ఈ ట్వీట్‌ను వైరల్ చేస్తోంది.                                  


      కుటుంబ పాలనకు తెర దించుతాం - అమిత్ షాతో భేటీ తర్వాత తెలంగాణ బీజేపీ నేతల ధీమా !