KTR : హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు బుధవారం రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ను కలిశారు. ప్రవళిక కుటుంబసభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు. ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని మంత్రి కెటిఆర్ వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకుని చట్టపరంగా శిక్షపడేలా చూస్తామన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం.. ఒకరికి ఉద్యోగం ఇస్తామని వాళ్ల కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. కేసు పురోగతిపై డిజిపితో మాట్లాడినట్లు కెటిఆర్ చెప్పారని ప్రవళిక సోదరుడు తెలిపారు. మా కుటుబానికి అండగా ఉంటామని కెటిఆర్ హామీ ఇచ్చారన్నారు.


బుధ‌వారం ఉద‌యం కరీంనగర్​లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు.“ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారు. ప్రవళిక కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతే కాకుండా ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తపడతాం.” అని కేటీఆర్ తెలిపారు.       


మంత్రి కేటీఆర్ ని ప్రవళ్లిక కుటుంబ సభ్యులు కలిసి.. తమ ఆవేదన పంచుకున్నారు. మా కూతురు మృతికి కారణమైన శివరాంని కఠినంగా శిక్షించాలని కోరారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రవళ్లిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా శిక్షపడేలా చూస్తామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రవళ్లిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సదర్భంగా ప్రవళ్లిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.                               


ముందుగా ప్రవళ్లిక కుటుంబసభ్యులు గ్రూప్స్ పరీక్ష వాయిదా పడటం వల్లనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కానీ రెండు రోజుల్లో వారి మాట మారింది.  ప్రవళిక ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులు మొదలుకుని అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి పాలకులు, టీఎస్పీఎస్సీపై విమర్శలు వచ్చాయి. ఇది ప్రభుత్వ హత్యేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆత్మహత్య చేసుకోవటానికి కొన్ని నిమిషాల ముందు ప్రవళిక తనతో మాట్లాడిందని ఆమె తండ్రి లింగయ్య చెప్పాడు. గ్రూప్​2 పరీక్షలు వాయిదా పడ్డాయని బాధపడిందని తెలిపాడు. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత రెండు రోజుల వరకు ఆమె కుటుంబ సభ్యులు శివరాం రాథోడ్​ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రవళిక రాసినట్టుగా చెబుతున్న సూసైడ్​నోట్‌లో అతడి పేరుగానీ,​ప్రేమ వ్యవహారం గానీ పేర్కొనలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మూడు రోజుల్లోనే ప్రవళిక తల్లి, సోదరుడు మాట మార్చటం  రాజకీయంగా చర్చనీయాంశం అయింది.