తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ట్వీట్టర్ ద్వారా ఎంతో మంది ఆపన్నులను ఆదుకుంటూ ఉంటారు. అదే ట్విట్టర్ ద్వారా ఇప్పుడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ను తెలంగాణకు ఆహ్వానించారు. తాను తెలంగాణకు ఐటీ , ఇండస్ట్రీ మంత్రినని పరిచయం చేసుకుని ఇండియా, తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించడానికి టెస్లాతో  భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని సందేశం పంపారు. టెస్లా ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో భాగం పంచుకుంటామన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ప్లస్ పాయింట్లను వివరించారు. 





Also Read: బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ నాయకత్వంలో మరో రైతు ఉద్యమం : ప్రశాంత్ రెడ్డి


ఇదంతా ఎందుకంటే టెస్లా ఇండియాకు రావడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఎలన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. దాన్ని కేటీఆర్ అవకాశంగా మల్చుకున్నారు. టెస్లా కార్లను ఇండియాలో అమ్మడానికి ఎలన్ మస్క్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక పనులు పూర్తయ్యాయి. కానీ ఆలస్యమవుతోంది. ఇలా ఎందుకు ఆలస్యం అవుతోందని.. త్వరగా కార్లను ఇండియాలో అమ్మాలని ట్విట్టర్ ద్వారా ఓ వ్యక్తి కోరాడు. దానికి ఎలన్ మస్క్ రిప్లయ్ ఇచ్చాడు. తమకు చాలా సవాళ్లు ఎదరవుతున్నాయని చెప్పాడు. 


 






Also Read: టీచర్లకు బదిలీలు తెచ్చిన కొత్త చిక్కు... వేర్వేరు జిల్లాలకు భార్యభర్తల బదిలీలు...


ఎలన్ మస్క్ రిప్లయ్‌పై ట్విట్టర్‌లో  రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలన్ మస్క్ ఇండియాలో కార్లు అమ్మేందుకు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులు కోరుతున్నారు. అదే సమయంలో ఇండియాలో తయారు చేస్తేనే పన్ను మినహాయింపులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ చర్చలు ఇంకా పూర్తి కాలేదు. అయితే తరచూ ఇండియాలో కార్లు అమ్మడానికి సవాళ్లు ఎదురవుతున్నాయన్న అభిప్రాయాన్నిల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Also Read: రైతుల కోసం జైలుకెళ్లడానికైనా కేసీఆర్ సిద్ధమే .. కేంద్రానికి భయపడేది లేదన్న టీఆర్ఎస్


తెలంగాణకు టెస్లాను తీసుకు రావాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు కానీ.,. ఇప్పటికే టెస్లా కర్ణాటకలో రిజిస్టర్ అయింది. అక్కడే ప్లాంట్ పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో  దేశంలో టెస్లాకు ఎదురవుతున్న సవాళ్లను  పరిష్కారంలో తమ వంతు సాయం చేసేందుకు కేటీఆర్ ముందుకు రావడంతో .. ఈ వైపు ఏమైనా చూస్తారమమో చూడాలి !



Also Read: సంక్రాంతికి ఊరెళ్లిపోతా మామ... ప్రయాణికులతో బస్టాండ్ లు, టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి