కరోనా మహమ్మారి నివారణకు అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ పంపిణీలో ఖమ్మం జిల్లా 100% పూర్తిచేసింది. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై జిల్లా యంత్రాంగాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అభినందించారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు పని చేసిన సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారన్నారు. వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి తెలియజేశారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రంగం, సిబ్బంది సాహసోపేతంగా పనిచేశారని గుర్తు చేశారు. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని ఆయన సూచించారు. 


Also Read: తీవ్ర తోపులాటల మధ్య రేవంత్ రెడ్డి అరెస్టు.. చిరిగిన మల్లు రవి చొక్కా, పీఎస్‌కు తరలింపు


రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 99.35 శాతం


ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసుని అంద‌రూ త‌ప్పకుండా వేయించుకోవాల‌ని, బూస్టర్ డోస్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ కుమార్ అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు తప్పక ధరించాలని విజ్ఞప్తి చేశారు. టీకాలు వేసుకొనేందుకు ఆసక్తి చూపని వారు, గడువు ముగిసినా రెండో డోస్‌ వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయాలని వైద్య సిబ్బందిని మంత్రి కోరారు. రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొదటి డోస్‌ 99.35 శాతానికిపైగా వేయగా, 63.40 శాతం మందికి రెండో డోస్ లు అందించడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం వ్యక్తం చేశారు. 100% వాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు వైద్య సిబ్బందిని శాలువతో సత్కరించారు.


Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా


తెలంగాణలో 25 లక్షల మందికి ప్రికాషన్ డోస్


దేశంలో 60 ఏళ్లకు పైబడిన సుమారు 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జనవరిలో చేపట్టనున్న ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణలో 25 లక్షల మందికి మూడో డోస్ వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడి వారిలో 65 లక్షల మంది వరకూ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ రెండో డోసు వేసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారికే మూడో డోస్ వ్యాక్సిన్ వేయనున్నారు. తెలంగాణలో మూడో డోసు వేసుకోవడానికి ఎక్కువ అర్హత కలిగిన వారు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారే అన్నారు. వీరి సంఖ్య సుమారు 2.73 కోట్లు ఉంటారని తెలుస్తోంది. అది గాక 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల వారు 1.17 కోట్ల మంది వరకూ ఉన్నారు. 


Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి