తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకులకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా రాజ్‌భవన్‌వైపు కన్నెత్తి చూడలేదు. పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరు కాలేదు. గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో   శ్రీ శుభకృత్‌ నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో పాల్గొనాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేసీఆర్‌ను ఆహ్వానించారు.  ప్రగతి భవన్‌కు ఆహ్వానం కూడా పంపారు. అయితే ముఖ్యమంత్రి కసీఆర్‌తోపాటు మంత్రులు కూడా  గైర్హాజరయ్యారు. 


వరంగల్ ఎంజీఎం ఎలుకలు కొరికిన ఘటనపై ప్రభుత్వం సీరియస్, సూపరింటెండ్ పై వేటు, బాధితుడికి నిమ్స్ లో వైద్యం


రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్య సాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు , ఈటెల రాజేందర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, పలువురు జడ్జీలు, ప్రముఖులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో గవర్నర్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం కూడా లేకుండానే నిర్వహించారు. 


ఈ సారి యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ది - ఈ సారి ఆ స్వామి మార్గదర్శకత్వంలో !?


బీజేపీ అజెండాను అమలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసై విమర్శలు చేసింది.  కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడంతో ప్రారంభమైన విభేదాలు తర్వాత వివిధ అంశాల వల్ల పెరిగి పెద్దవయ్యాయని టీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో గవర్నర్‌కు ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయినా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. 


గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాజ్‌ భవన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవి.  ఆయన తరచూ రాజ్‌భవన్‌్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. గవర్నర్‌గా తమిళిశై వచ్చిన తర్వాత కూడా రాజ్ భవన్‌తో ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఇటీవలి రాజకీయ పరిణామాలతో బీజేపీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించిన తర్వాత గవర్నర్ విషయంలో కేసీఆర్ కఠినంగా ఉంటున్నారు. గవర్నర్ వ్యవస్థపైనా విమర్శలు చేస్తున్నారు.