KCR ON Mla Farm House Case :  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆధారాలను కేసీఆర్ బయట పెట్టారు.  ప్ర‌జాస్వామ్య హంత‌కుల యొక్క స్వైర విహారం చాలాచాలా ఈ దేశం యొక్క పునాదుల‌కే ప్ర‌మాద‌క‌రం అని కేసీఆర్ పేర్కొన్నారు.- మునుగోడులో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ముఠా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తిరుగుతోందని.. దీనికి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌లు నాయకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. మూడు గంటల ఫామ్ హౌస్ వీడియోలు ఉన్నాయని.. అయితే ప్రేక్షకుల.. ప్రజల సౌకర్యార్థం వాటిని గంటకు కుదించి అందరికీ పంపిస్తున్నామన ిప్రకటించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చారని.. ఆ ఆపరేషన్ల గుట్టు మొత్తం ఆ వీడియోలో ఉందన్నారు. 



ప్రజాస్వామ్య హత్య జరుగుతోందన్న కేసీఆర్ 


ఈ రోజు మీడియా స‌మావేశం ఏదైతో ఉందో చాలా భార‌మైన మ‌న‌సుతో దుఖంతో నిర్వ‌హిస్తున్నాను. చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఈ దేశంలో నెల‌కొని ఉన్నాయి. ఈ దేశంలో దుర్మార్గం జ‌రుగుతుంది. ప్ర‌జాస్వామ హ‌త్య నిర్ల‌జ్జ‌గా విశృంఖ‌లంగా, విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతోన్న ప్ర‌జాస్వామ్య‌ హ‌త్య . ఈ ప్ర‌జాస్వామ్య హంత‌కుల యొక్క స్వైర‌విహారం ఈ దేశం యొక్క పునాదుల‌కే ప్ర‌మాదక‌రం. అత్యంత భ‌యంక‌ర‌మైన‌ది. చాలా భాదాక‌ర‌మైన ప‌రిస్థితి. కనీసం మ‌న ఊహాకు కూడా అంద‌దు. అందుకే బాధ‌తో మాట్లాడుతున్నాను. 8 ఏండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వ‌చ్చి దేశాన్ని అన్ని రంగాల్లో స‌ర్వ‌నాశ‌నం చేసింది. రూపాయి ప‌డిపోయింది. నిరుద్యోగం తాండ‌విస్తుంది. ఆక‌లి రాజ్యంగా మారుతోంది ఇండియా. అంత‌ర్జాతీయ సూచిక‌లు మంచి చెడును చూపిస్తున్నాయి. దేశ విభ‌జ‌న‌, ప్ర‌జ‌ల‌ను విభ‌జించడం.. భార‌త ప్ర‌జాస్వామ్య నాడీని క‌లుషితం చేస్తున్నాయి. చాలా దారుణ‌మైన ప‌ద్ధ‌తుల్లో పోతున్నారు. నేను కూడా బాధ‌కు గుర‌య్యాను అని కేసీఆర్ పేర్కొన్నారు.


ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్‌తో పాటు ఏపీ  ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం 


8 ప్ర‌భుత్వాలు కూల‌గొట్టాం. మ‌రో 4 ప్ర‌భుత్వాలు కూల‌గొడుతాం. తెలంగాణ‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌లో ప్ర‌భుత్వాలు కూల‌గొడుతాం అని ఆ ముఠా స‌భ్యులు పేర్కొన్నారు. దీన్ని రాజ‌కీయం అంటారా? అక్క‌డ మౌనం పాటించారు కాబ‌ట్టి 8 ప్ర‌భుత్వాలు కూలిపోయాయి. తెలంగాణ చైత‌న్య‌వంత‌మైన గ‌డ్డ కాబ‌ట్టి.. ఈ రాక్ష‌సుల కుట్ర‌ను బ‌ద్ద‌లు కొట్టారు. ఆ ముఠాను ప‌ట్టుకున్నాం కాబ‌ట్టి ఇదంతా బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌త అనేక రోజులుగా ఈ వ్య‌వ‌హారం జ‌రుగుతుంది. ఈడీ టు ఇన్ క‌మ్ ట్యాక్స్ అంతా మా వ‌ద్దే ఉన్న‌రు అని చెప్పారు. ఈ దేశంలో ఏం జ‌రుగుతోంది. ఈ ముఠాల స్వైర‌విహారం చూస్తే మీరు ఆశ్చ‌ర్య‌ప‌డుతారు. ఈ ముఠాలో 24 మంది స‌భ్యులు ఉన్నారు. ఒక్కొక్క‌రికి రెండు మూడు ఆధార్ కార్డులు ఉంటాయి. ఇది పెద్ద ఫ్రాడ్. మొన్న దొరికిన కేర‌ళ‌కు చెందిన తుషార్.. వ‌య‌నాడ్‌లో రాహుల్‌పై పోటీ చేశారు అని కేసీఆర్ గుర్తు చేశారు.  ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో అరవై మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ప్రభుత్వం మారదు.  కానీ ఇటీవల జగన్ తనను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న తర్వాత సజ్జల అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో సందేహాలు అలాగే ఉన్నాయి. కేసీఆర్ ప్రకటన తర్వాత ఏపీ కూడా బీజేపీ హిట్ లిస్ట్‌లో ఉన్నదని అంచనా వేస్తున్నారు. 


దేశంలో  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి !


కేంద్రప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తోందని  మండిపడ్ఆడారు.  . బీజీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్‌ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ధ్వజమెత్తారు.  రాజ్యాంగబద్ద సంస్థలపై బీజేపీకి గౌరవం లేదు. ఎవరినైనా బెదిరించగలం..ఏదైనా చేయగలమనే ధోరణిలో కేంద్రం వెళ్తోందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ దేశాన్ని కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరిని, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను. జడ్జిలను వినయపూర్వకంగా వేడుకుంటున్నానన్నారు. సీబీఐ, ఈడీ, సీవీసీ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. దేశంలో ప్రజాస్వామ్య హత్య జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరినీ కోరుతున్నా.నన్నారు 


బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోందన్న కేసీఆర్ 


బీజేపీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తోంది. ఓట‌మిని, గెలుపును ఏదైనా స‌రే స్వీక‌రించాలి. దుర్మార్గ ప‌ద్ధ‌తుల్లో ముందుకు పోతున్నారు. ఉద్య‌మ సంద‌ర్భంలో కూడా మేం ఇంత హేయంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఇంత దౌర్భాగ్య‌క‌రంగా వెళ్ల‌లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతుంది. ప్రజాస్వామ్యానికి మూల‌స్తంభాలుగా లెజిస్లేచ‌ర్, కార్య‌నిర్వ‌హ‌క‌ వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌, నాలుగోది ప్రెస్‌. వీట‌న్నింటిని ప‌క్క‌న పెట్టేశారు. ఎవ‌రినైనా బెదిరించ‌గ‌లం, ఏమైనా చేయ‌గ‌లం అని అనుకుంటున్నారు. ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి. ఎవ‌రు కూడా ఊహించ‌లేదు అని కేసీఆర్ తెలిపారు.మునుగోడులో కూడా వెకిలి ప్ర‌య‌త్నాలు చేశారు. చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్ర‌చారాలు చేశారు. పాల్వాయి స్ర‌వంతి త‌న‌ను క‌లిసిన‌ట్టు, కొన్ని టీవీల పేర్లు పెట్టి ప్ర‌చారం చేశారు. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి, పోతాయి. గెలుస్తం, ఓడిపోతం. హుజురాబాద్‌లో ఓట‌మి పాల‌య్యాం. దుబ్బాక‌లో స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయాం. నాగార్జున సాగ‌ర్‌, హుజుర్‌న‌గ‌ర్‌లో గెలిచాం. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాలి. మేం గెలిస్తేనే లెక్క అంటే ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ ఉంట‌ది. రాజ‌కీయాల్లో, ప్ర‌జాజీవితంలో సంయ‌మ‌నం ఉండాలి. చివ‌రికి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఫెయిల్ అయింద‌ని ఆరోపించారు. వారిని గెలిపిస్తే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మంచిది. ఓడగొడితే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఫెయిల్ అంటారని విమర్శించారు.