Gajwel KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక నుంచి గజ్వేల్ నియోజకవర్గానికి నెలకు ఓ రోజు కేటాయిస్తానని తెలపారు. గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. మేడ్చల్ తూంకుంటలోని కన్వెన్షన్ హాలులో బిఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కెసిఆర్ తో పాటు మంత్రి హరీశ్ రావు, ఒంటేరు ప్రతాపరెడ్డి, రఘోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గజ్వేల్‌లో ఒక్క నిరుపేద కూడా ఉండకూడదన్న కేసీఆర్
95 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో గెలవనున్నామని ఆయన వెల్లడించారు. విద్యుత్, తాగు నీరు సమస్యలు పరిష్కరించుకున్నామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద ఉండొద్దన్నదే బిఆర్ఎస్ లక్ష్యమన్నారు. ఇకపై ప్రతి నెలలో ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తానని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి తమమానికంగా గజ్వేల్ ను తీర్చిదిద్దుతానని కెసిఆర్ స్పష్టం చేశారు.గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద ఉండొద్దన్నదే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాష్టానికి తలమానికంగా గజ్వేల్ ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణ నేతలకు టికెట్లు కేటాయించేటప్పుడు దారుణమైన పరిస్థితులు ఉండేవని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పార్టీ టికెట్ల కోసం పోయిన నేతలను చులకనగా చూశారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో మూడో సారి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా
తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందని బెదిరించేవారిని, కానీ ఇప్పుడు అన్నీ రంగాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. మిషన్ భగీరథకు స్ఫూర్తి సిద్దిపేటలో అమలు చేసిన తాగునీటి పథకమేనని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి బిందెల ప్రదర్శన ఉండేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితి లేదన్నారు. వలస పోయిన రైతులు మళ్లీ గ్రామాలకు రావాలనే లక్ష్యంతో పనిచేశామని సీఎం తెలిపారు.
కామారెడ్డిలో కూడా పోటీ చేస్తూండటంతో గజ్వేల్ లో గడ్డు పరిస్థితి ఉందని ప్రచారం
ఈ సారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నరు. దీంతో గజ్వేల్ లో గడ్డు పరిస్థితులు ఉన్న కారణంగానే ఆయన నియోజకవర్గం మారుతున్నారని విస్తృత ప్రచార జరుగుతోంది. దీంతో కేసీఆర్ గజ్వేల్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉండే కేసీఆర్ ఎక్కువ కాలం .. గజ్వేల్ నియోజకవర్గంలో భాగంగా ఉండే ఫామ్ హౌస్ లోనే ఉంటారు. కానీ అక్కడ నియోజకవర్గ సమస్యలపై పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేసేందుకు ప్రత్యేకంగా అక్కడి నేతలతో కేసీఆర్ సమావేశం అయినట్లుగా తెలుస్తోంది.