మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం అయిన సిరిసిల్లను వర్షాలు ముంచెత్తాయి. ఇటీవలే నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంలోకి సైతం వరద నీరు ప్రవేశించింది. కలెక్టరేట్ భవనానికి వెళ్లే రహదారులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో సోమవారం చాలా సేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి కూడా వరద ధాటికి లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. సోమవారం రాత్రి మొత్తం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సిరిసిల్ల కలెక్టరేట్ చుట్టూ దాదాపు అర కిలోమీటరు మేర భారీగా వరద నీరు చేరింది.


Also Read: గుడ్‌న్యూస్! హైదరాబాద్-ముంబయి బుల్లెట్ రైలు కోసం కీలక ముందడుగు


నిజానికి సిరిసిల్లలో ఇవాళ (సెప్టెంబరు 28) వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి కలెక్టర్ పర్యటన ఉంది. కానీ, ఆయన వరద కారణంగా లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత ట్రాక్టర్, జేసీబీలను తీసుకొచ్చి.. ట్రాక్టర్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతిని బయటకు తీసుకొని వచ్చారు. ఒకవేళ వరద నీటిలో ట్రాక్టర్ ఆగిపోతే నెట్టేందుకు వెనకాలే జేసీబీ కూడా వెళ్లాల్సి వచ్చింది. కలెక్టర్‌ని గన్ మ్యాన్, ఇతర సిబ్బందిని ట్రాక్టర్‌లో బయటకు తీసుకొని వచ్చారు. ఇలా కలెక్టరేట్ మునిగిపోవడం ఇది మూడోసారి. కలెక్టరేట్ చుట్టూ చేరిన నీటిని బయటకు పంపిచేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ కలెక్టరేట్ కార్యాయలంలోకి వరద నీరు వచ్చిన సంగతి తెలిసిందే.


Watch: యాచకుడిగా మారిన ప్రభుత్వ ఉద్యోగి... రోడ్డుపైనే జీవనం రేకుల షెడ్డే నివాసం


ముంపు ప్రాంతంలో కలెక్టరేట్ నిర్మించారంటూ అటు ప్రతిపక్షాల నుండి.. ఇటు ప్రజల నుండి విమర్శలు వచ్చినా అధికారులు లెక్క చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలనకి కీలకమైన కలెక్టరేట్ భవనానికి ఈ సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.


Also Read: లీడర్స్.. ఇంత కన్నా దిగజారకండి ప్లీజ్ ! సభ్యత హద్దులు దాటిపోతున్న నేతల భాషా ప్రావీణ్యం !


ఇటీవలే ప్రారంభం
సిరిసిల్లలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వ‌నం ఇటీవలే ప్రారంభమైంది. జులై నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కూడా కొత్త కలెక్టరేట్లను నిర్మించారు. వీటిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ప్రారంభించారు.



Also Read: మ్యాట్రిమోనీలో పరిచయం.. పిలిస్తే రూంకి వెళ్లిన యువతి, ఊహించని ఝలక్ ఇచ్చిన యువకుడు!


Also Read: హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి