Ponnam Prabhakar on Bandi sanjay: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల నాయకులు గెలుపే లక్ష్యంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజా హితయాత్రను రోజూ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ సభలో ప్రసంగిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లి ఆత్మ శాంతించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో దుమారం రేగింది. పొన్నం ప్రభాకర్ తల్లి జీవించే ఉన్నారు. కానీ, బండి సంజయ్ స్వర్గంలో ఉన్న పొన్నం ప్రభాకర్ తల్లి అంటూ వ్యాఖ్యానించారు.


ఇదే విషయంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆవేదన చెందారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు రెండు రోజులు నిద్రపోలేదని అన్నారు. ఆయనకు చేతులెత్తి మొక్కుతూ దండం పెడుతూ చెబుతున్నానని.. ఇలాంటి మూర్ఖుడి సభావాన్ని ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం లేస్తే చాలు బండి సంజయ్ కి మద్యం మాంసం లేనిదే పొద్దు గడవదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తనకు మాంసాహారంతో పాటు ఏ అలవాట్లు లేవని అన్నారు. తన దయ దక్షిణ్యాల వల్ల అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా గెలిచిన విషయాన్ని పొన్నం ప్రభాకర్ గుర్తుంచుకోవాలని అన్నారు.