Karimnagar Latest News: కఫిసో విశిష్ట మహిళ పురస్కారాలకు ఎంపికైన కనకవ్వ, నాగదర్గ, శ్రీదేవి రెడ్డి
Karimnagar Latest News: లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించే కరీంనగర్ ఫిలిం సొసైటీ ఈసారి కూడా ఉమెన్స్ డే రోజున అవార్డులు ప్రదానం చేయనుంది. ముగ్గురు ప్రముఖులకు పురుస్కారాలు అందించనుంది.

Karimnagar Latest News : కరీంనగర్ ఫిలిం సొసైటీ ప్రతి ఏటా ప్రదానం చేసే కఫీసో విశిష్ట మహిళ పురస్కారం 2025 లో ముగ్గురు ప్రముఖ మహిళలను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం డా.రవిచంద్ర, కార్యదర్శి లక్ష్మి గౌతమ్ తెలిపారు. ప్రఖ్యాత రచయిత్రి తంగేళ్ల శ్రీదేవి రెడ్డి, ప్రముఖ జానపద గాయని కనకవ్వ, ప్రసిద్ధ నర్తకి గుత్తా నాగదుర్గ ఈ కఫీసో శిష్ట మహిళా పరిస్కారాలకు ఎంపికయ్యారు.
తంగేళ్ల శ్రీదేవి రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే
కరీంనగర్ ఫిలిం భవన్‌లో మహిళా దినోత్సవం రోజు మార్చ్ 8న సాయంత్రం 6 గంటలకు పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తంగేళ్ల శ్రీదేవి రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ప్రముఖ తెలుగు రచయిత్రి. ఈమె నవలలతో పాటు కథలు కవితలు రాశారు. బతుకమ్మ బోనాలు లాంటి సందర్భాలలో అనేక పాటలు రాశారు. వివిధ అంశాలపై గొప్ప వ్యాసాలు రాశారు. దొరసాని సినిమాలో హీరో చెప్పే కవితల్లో కొన్ని కవితలు శ్రీదేవే రాశారు. గతంలో తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారంతోపాటు అనేక పురస్కారాలు పొందారు. ఈమె బతుకమ్మ, బోనాల కోసం రాసిన పాటలు అందరికి సుపరిచతమే. దెయ్యం, దేవుడు పారిపోయాడు, కావలి బుడ్డమ్మ ఇలా 50కిపైగా కథలు రాశారు. రాజకీయ నేతల పొలిటికల్ క్యాంపెయిన్‌పై కూడా శ్రీదేవి పాటలు రాశారు. ప్రత్యేక హోదాపై ఈమె రాసిన పాటలు ఎంతో గుర్తింపు తెచ్చాయి.
Also Read: బిల్లులు మంజూరుకు కమిషన్లు అడుగుతున్నారు - భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన
జానపదమే కనకవ్వను జనానికి పరిచయం చేసింది
గొట్టె కనకవ్వ ప్రసిద్ధ తెలంగాణ జానపద గాయని. ఆమె సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగెపల్లి గ్రామవాసి. చిన్నప్పటి నుంచి వరి నాటు వేసేందుకు కలుపు తీసేందుకు తల్లితో వెళ్లి జానపద పాటలు నేర్చుకుంది. ఈమె యూట్యూబ్ ఫోక్ స్టార్‌గా అందరికీ సుపరిచితురాలు. కొన్ని సినిమాలలోనూ నటించింది. కనకవ్వ ఫోక్స్ స్టూడియో పాటలకు లక్షలాది వ్యూస్ రావడంతోపాటు కొద్ది రోజుల్లోనే వైరల్ అయ్యాయి. కూలి పనులు చేస్తూ, జీవనం సాగించే కనకవ్వ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, ఏ మాత్రం అధైర్యపడకుండా జీవితంలో ఎన్నో ప్రశంసలు,అవార్డులు అందుకున్నారు. మేడారం, సంక్రాంతి జాతర సమయంలో ఆమె గొంతు నుంచి వెలువడే ఫోక్ సాంగ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు.
నాగదుర్గ గజ్జె కడితే అద్భుతమే
గుత్తా నాగదుర్గ ప్రసిద్ధ నృత్య కళాకారిణి. నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం స్థాపించి వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. యూట్యూబ్ సెన్సేషన్‌గా అందరికీ ఈమె సుపరిచితురాలు. నాలుగేళ్ల వయస్సు నుంచే కాళ్లకు గజ్జెలు కట్టి కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు నాగదుర్గ. మెల్లగా ఆమె ఆశక్తి పేరణివైపు మళ్లింది. ఇది కాకతీయుల కాలం నాటి సైనిక నృత్య ప్రక్రియ. పురుషులకే ప్రత్యేకమైన ఈ పేరణి వైపు మళ్లిన నాగదుర్గ, ఆ తరువాత కాలంలో తన ప్రతిభతో వందలాది పదర్శనలు ఇచ్చారు. దీంతో కోట్ల మంది ప్రశంసలందుకున్నారు. ఇప్పుడు నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం స్థాపించి ఆసక్తి ఉన్న చిన్నారుకు శిక్షణ ఇస్తున్నారు. తాను నేర్చుకున్న పేరణి కళను ఉచితంగా బోధించడంతోపాటు ఏకంగా 1600కుపైగా పదర్శనలు ఇచ్చారు గుత్తా నాగదుర్గ.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు