KCR Latest News: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ కీలక సమావేశం- హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 

KCR Latest News: తెలంగాణలో కేసీఆర్ గేర్ మారుస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Continues below advertisement

Telangana News: తెలంగాణలో రాజకీయాలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు ముందు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అన్నట్టు మారిపోతున్నాయి. మూడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించి మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయలేదు. ఈ ఫలితాల తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. 

Continues below advertisement

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ దూకుడుగా ఉంటే కాంగ్రెస్ డిఫెన్స్ మోడ్‌లో రాజకీయాలు చేస్తోంది. అసలు పోటీ చేయని బీఆర్‌ఎస్ మరింత జాగ్రత్తపడుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును బీజేపీ తనవైపు తిప్పుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసింది అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్. వారి అభిప్రాయం ఇప్పుడు చర్చనీయంశం అవుతోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్ వేళ వాళ్లు ఇచ్చిన తీర్పు అన్ని రాజకీయ పార్టీలను అలర్ట్ చేసింది. 

ముందుగా తన ఓటు బ్యాంకును మరింత పెంచుకునే దిశగా బీఆర్‌ఎస్ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలంతా హాజరయ్యారు. భవిష్యత్‌లో పార్టీ పరంగా అనుసరించాల్సిన పంథాపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 

Image

ఈ మధ్య పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై త్వరగానే ప్రజల్లో అసంతృప్తి వచ్చిందని తిరుగుబాటు ఖాయమని అన్నారు. నాటి పాలనతో నేటి పాలనను పోల్చి చూస్తున్న ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీయడం మొదలు పెట్టారని చెప్పారు. తెలంగాణలో ప్రజలకు మంచి చేసింది కేవలం బీఆర్‌ఎస్ మాత్రమేనని అందుకే ప్రజలు మళ్లీ ఆ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. 

Also Read: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం

ప్రజా సమస్యలు గుర్తించి వారికి బీఆర్‌ఎస్ నేతలు అండగా ఉండాలని కేసీఆర్ నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఏడాది పాటు వేడకులు జరపాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఏప్రిల్‌లో భారీ మీటింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 27న జరిగే పార్టీ ఆవిర్భావ మీటింగ్‌కు భారీ స్థాయిలో జనం తరలి రానున్నారని అందుకు తగ్గ ఏర్పాట్లపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. 

శుక్రవారం జరిపిన మీటింగ్‌లో ఆ మీటింగ్ గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో జరిగే బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంపై కూడా మాట్లాడుకున్నారు. దీంతోపాటు 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అంశాలు చర్చకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఏ విషయాలపై మాట్లాడారు.  

Continues below advertisement