KTR Comments On New IT ACT: ప్రాథమిక హక్కుల్లో కేంద్రం జోక్యం- కొత్త ఐటీ చట్టంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR Comments On New IT ACT: మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఐటీ చట్టంతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని అభిప్రాయపడ్డారు కేటీఆర్. దీన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

Continues below advertisement

KTR Latest News: కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ద్వారా కేంద్రానికి అపరిమిత అధికారులు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును అన్ని పార్టీలు వ్యతిరేకించాలని ఆయన సూచించారు. 

Continues below advertisement

పరిధికి మించిన స్వేచ్ఛ

కేంద్రం ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు 2025పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును పౌరుల డిజిటల్ గోప్యత ముప్పుగా అభివర్ణించిన కేటీఆర్‌...ఇందులో నిబంధనలు ఖండించారు. పన్ను అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం పరిధికి మించి అధికారాలను వినియోగించుకోవడానికి చూస్తోందని ఆరోపించారు. అందుకు ఈ బిల్లు సహకరించేలా ఉందని  అభిప్రాయపడ్డారు.

Also Read: ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు.. హోటల్‌కు రూ.27 లక్షలు ఫైన్

"కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఐటీ అధికారులకు సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాల తనిఖీ పేరుతో అపరిమిత అధికారాలను ఇచ్చేలా ఉంది" అని కేటీఆర్ అన్నారు. ఇందులో ప్రస్తావించిన ‘వర్చువల్ డిజిటల్ స్పైసెస్’ వేధింపులకు, దుర్వినియోగానికి, విస్తృత నిఘాకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 

"ఆర్థిక మంత్రి, ప్రధాని సమాధానం చెప్పాలి"

ఇప్పటికే దేశ పౌరుల ఆర్థిక డేటా అనేక సంస్థల ఆధీనంలో ఉందని, ఇప్పుడు తీసుకొచ్చే చట్టం పౌరుల ప్రాథమిక హక్కులు, డిజిటల్ గోప్యతను తొక్కేస్తుందన్నారు. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని అధికారులెవరైనా రూల్స్ దుర్వినియోగం చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. దీనికి ప్రధాని, ఆర్థికమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

పౌరులకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా వ్యవహరించే ప్రమాదం ఉందని, ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. ఐటీ వ్యవస్థకు ప్రస్తుత నిఘా వ్యవస్థలు సరిపోతాయన్నారు కేటీఆర్. ఈ అపరిమిత అధికారాలను నియంత్రించడంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి సీతారామన్ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు దక్కిన డిజిటల్ హక్కులపై ఈ బిల్లు పేరుతో జరుగుతున్న దాడిగా అభివర్ణించారు కేటీఆర్. పౌరులు, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు.

ఫిబ్రవరి 2025లో కొత్త బిల్లును సభలో కేంద్రం ప్రవేశ పెట్టింది. ఈ ఆదాయపు పన్ను బిల్లు, 1961 ఆదాయపు పన్ను చట్టానికి మించి అధికారాలను ఐటీ అధికారులకు కట్టబెడుతోంది. సెక్షన్ 247 ప్రకారం పన్ను ఎగవేత ఆరోపణలు ఉంటే సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఆన్లైన్ ఖాతాలతో సహా ఏదైనా “వర్చువల్ డిజిటల్ స్పేస్”ను యాక్సెస్ చేయవచ్చు. అనుమానం ఉన్న ఖాతాల్లో సోదాలు చేయవచ్చు. ఈ కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి రానుంది. 

Also Read: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Continues below advertisement