Half Day Schools in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 3వ వారం నుంచి వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు ఎండల తీవ్రత నుంచి కాపాండేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో మార్చి 15 నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్‌మెంట్ పరిధిలోని బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. 

ఆ కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు..తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..

➥ మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)

➥ మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

➥ మార్చి 24న ఇంగ్లిష్ 

➥ మార్చి 26న మ్యాథమెటిక్స్ 

➥ మార్చి 28న ఫిజికల్‌ సైన్స్‌ 

➥ మార్చి 29న బయోలాజికల్ సైన్స్ 

➥ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్.

➥ ఏప్రిల్ 3న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్), ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు థియరీ పరీక్ష.

➥ ఏప్రిల్ 4న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్)

కొనసాగుతున్న టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు..రాష్ట్రంలో పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు మార్చి 6న ప్రారంభమయ్యాయి. మార్చి 15 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు మ‌ధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షలు కొన‌సాగ‌నున్నాయి. అయితే ఫిజిక‌ల్ సైన్స్, బ‌యోలాజిక‌ల్ సైన్స్ ప‌రీక్షల‌ను మాత్రం గంట‌న్నర వ్యవ‌ధిలోనే నిర్వహించ‌నున్నారు. 

ప్రీ ఫైన‌ల్ ప‌రీక్షల తేదీలివే..

➥ మార్చి 6: ఫ‌స్ట్ లాంగ్వేజ్

➥ మార్చి 7: సెకండ్ లాంగ్వేజ్

➥ మార్చి 10: థ‌ర్డ్ లాంగ్వేజ్

➥ మార్చి 11: మ్యాథ‌మేటిక్స్

➥ మార్చి 12: ఫిజిక‌ల్ సైన్స్

➥ మార్చి 13: బ‌యోలాజిక్ సైన్స్

➥ మార్చి 15: సోష‌ల్ స్టడీస్

➥ మార్చి 21 నుంచి వార్షిక పరీక్షలు

ALSO READ: ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..